వేమన శతకం – 39

వేమన శతకం ఆ.మేక కుతికపట్టీ | మెడచున్న గుడువుగాఆక లేల మాను | నాశగాకలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము:ఓ వేమా! మేక యొక్క మెడను పట్టుకొని మెడక్రింద నుండు చన్నులను పట్టుకొని కుడిచినచో  ఆకలి తీరదు.…

వేమన శతకం – 38

వేమన శతకం ఆ.గొడ్డుటావు బిదుక | గుండ గొంపపోయినపాలనీక తన్ను | బండ్లు రాలలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! గొడ్డుటావును పితుకుటకు వెళ్ళిననూ పెద్ద కుండను తీసికొని అది పాలీయ్దు పైగా పండ్లురాలిపోవునట్లుగా…

వేమన శతకం – 37

వేమన శతకం ఆ.కనియు గానలేడు | కదలింపడా నోరువినియు వినగలేడు| విస్మయమునసంపదగలవాని | సన్నిపాతంబిదివిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కంటితో చూచుచుండియు యథార్థమును తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదలించు ప్రయత్నము కూడా చేయడు. వినుచుండియు, ఆశ్చర్యము కలుగునట్లుగ విషయములను…

వేమన శతకం – 36

వేమన శతకం ఆ. కులము గలుగువారు| గోత్రంబు గలవారువిద్య చేత విఱ్ఱ| వీగు వారుపసిడిగల్గువాని| బానిస కొడుకులువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మంచి కులము నందు పుట్టిన వారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించు…

వేమన శతకం – 35

వేమన శతకం ఆ. కులములేనివాడు | కలిమిచే వెలయునుకలిమి లేనివాడు | కులము దిగునుకులముకన్నభువిని | కలిమి ఎక్కువసుమీవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కులము తక్కువవాడు అయినను సంపద ఉన్న యెడల గొప్పవాడుగా కీర్తి పొందును. భాగ్యము లేనివాడు…

వేమన శతకం – 34

వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి యేనుగు చంపుబైట గుక్కచేత | భంగపడునుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మొసలి నీటిలో ఉన్నంత వరకు ఏనుగునైనా పట్టి చంపగలదు. ఆ మొసలి…

వేమన శతకం – 33

వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి దూరముపారుబైట మూరెడైన| బాఱలేదుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు మొసలి ఎంత దూరమైననూ పోగలదు.భూమి మీద ఒక్క మూరెడు దూరమైననూ పోలేదు.…

వేమన శతకం – 32

వేమన శతకం ఆ. నీళ్ళ మీద నోడ నిగిడి | తిన్నగ బ్రాకుబైట మూరెడైన | బాఱలేదునెలవు తప్పుచోట | నీర్పరి కొరగాడువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు పడవ చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ…

వేమన శతకం – 31

వేమన శతకం ఆ. కోపమునను ఘనత| కొంచెమైపోవునుగోపమునను మిగుల| గోడు గలుగుగోప మడచెనేని| గోర్కెలు నీడేరువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మనుష్యుని యొక్క గొప్పతనము కోపముచేత తగ్గిపోవును. దానిచే బాధలు కల్గును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోర్కెలు తీరును.…

వేమన శతకం – 30

వేమన శతకం ఆ. తామసించి చేయ| దగ దెట్టి కార్యంబువేగిరింప నదియు|విషమెయగునుపచ్చికాయ దెచ్చి| పండింప ఫలమౌనెవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! ఏ కార్యమునైననూ కోపముతో చేయకూడదు. ఒక వేళ తొందరపడి చేసిననూ అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చిపండవేసినచో అవి…

వేమన శతకం – 29

వేమన శతకం ఆ. పాల నీడిగింట | గ్రోలుచు నుండెనామనుజులెల్ల గూడి | మద్యమండ్రునిలువదగని చోట | నిలువ నిందలు వచ్చువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కల్లు అమ్ము వారింటి యండు పాలు త్రాగుచున్ననూ, అందరు మనుష్యులు అతడు…

వేమన శతకం – 28

వేమన శతకం ఆ. కానివారితోడ | గలసి మెలగుచున్నగాని వాని గానె | కాంతురవనితాటి క్రింద బాలు| త్రాగిన చందమౌవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! యోగ్యత లేని వారితో కలసి తిరుగుచున్నచో అట్టి వానిని, ప్రజలు అయోగ్యునిగానే భావిస్తారు.…

వేమన శతకం – 27

వేమన శతకం ఆ. మొష్టి వేపచెట్టు | మొదలంట ప్రజలకుబరగ మూలికలకు | బనికివచ్చునిర్దయాత్మకుండు | నీచుడెందులకౌనువిశ్వదాభిరామ| వినురవేమ| తాత్పర్యము: ఓ వేమా! ముషిణి చెట్టు, వేప చెట్టు వంట్వి ఎంత చేదుగల వైనను దాని వ్రేళ్లతో కూడా ప్రజలకు ఔషధములుగా…

వేమన శతకం – 26

వేమన శతకం ఆ. పాలు పంచదార|పాపర పండ్లతోజాల బోసి వండఁ|జవికిరాదుకుటిల మానవులకు|గుణమేల కల్గురావిశ్వదాభిరామ|వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! చేదు పండ్లకు పాలు, పంచదార పోసి వంటకము చేసిననూ చేదుగుణములు పోక అట్లే నిలిచి ఉండును. అట్లే మంచిగుణములెన్ని ప్రబోధించిననూ దుర్మార్గుడైన వాడు…

వేమన శతకం – 25

వేమన శతకం ఆ. వేము పాలువోసి | ప్రేమతోఁ బెంచినచేదు విఱిగి తీపి | చెందబోదు,ఓగు నోగెఁగాక | యుచితజ్ఞుఁ డెటులౌనువిశ్వదాభిరామ | వినురవేమ ! తాత్పర్యము: ఓ వేమా ! వేప చెట్టుకు పాలుపోసి ఎంతో జాగ్రత్తగా పెంచిననూ దాని…

వేమన శతకం – 24

వేమన శతకం ఆ. పాముకన్న లేదు | పాపిష్టి జీవంబు అట్టి పాము జెప్పి | నట్టె వినును ఖలుని గుణము మాన్పు | ఘనులెవ్వరును లేరు విశ్వదాభిరామ | వినురవేమ ! తాత్పర్యము: ఓ వేమా ! దుష్టజంతువు అయిన…

వేమన శతకం – 23

వేమన శతకం ఆ. ఎలుకతోలుఁదెచ్చి|ఏడాది యుతికిననలుపు నలుపెగాని|తెలుపురాదుకొయ్యబొమ్మ దెచ్చి|కొట్టినఁబలుకదువిశ్వదాభిరామ|వినురవేమ! తాత్పర్యము : కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా, తిట్టినా పలుకదు. అట్లే ఎలుకతోలు తెచ్చి సంవత్సరకాలముపాటు ఉతికినను దానినలుపు రంగు పోదు, తెలుపు రానేరాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంత కాలము కృషి…

వేమన శతకం – 22

వేమన శతకం ఆ. ఎద్దు కైనఁగాని | యేడాది తెల్పినమాట దెలసి నడచు | మర్మమెఱిఁగిమొప్పె తెలియలేడు | ముప్పదేండ్లకునైనవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా ! బండిలాగు ఎద్దుకైననూ ఒక సంవత్సరము శిక్షణ ఇచ్చినయెడల సూచించిన మాటలను అనుసరించి…

వేమన శతకం – 21

వేమన శతకం ఆ. అల్పుడైనవాని|కధిక భాగ్యముగల్గదొడ్డవారిఁదిట్టి|తొలఁగ గొట్టుఅల్పజాతి మొప్పె|యధికుల నెఱుఁగునావిశ్వదాభిరామ|వినురవేమ! తాత్పర్యము : ఓ వేమా! హీనబుద్ధిగలవానికి సంపద గల్గినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటె గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. Vemana Shatakam…

వేమన శతకం – 20

వేమన శతకం ఆ. అల్పబుద్ధి వాని|కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల|దోలి తిరుగుఁ జెప్పు దినెడు కుక్క|చెఱకు తీపెరుఱుగునా విశ్వదాభిరామ|వినురవేమా! తాత్పర్యము : ఓ వేమా! హీనమైన బుద్ధిగల వానికి అధికారము కట్టబెట్టినచో అతడు అక్కడ నుండు మంచివారిని వెళ్ళగొట్టును. వారిని అవమానించును…