శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా)

ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…

జగద్గురువులు శంకరులు

పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు(జగద్గురుబోధలనుండి) తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆది శంకరులుమరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవం పోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం…

ప్లవ నామ సంవత్సరంలో విశేష తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషంఏప్రిల్ 202113స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః, వసంత నవరాత్రారంభః, మేషసంక్రమణం14సౌరసంవత్సరాదిః15మాస గౌరీ వ్రతారంభః, మత్స్యజయన్తీ16గణేశదమన పూజా17లక్ష్మీ పంచమీ21సర్వేషాం శ్రీ రామనవమీ22ధర్మదశమీ23సర్వేషాం కామకైకాదశీ24వామన ద్వాదశీ25అనంగత్రయోదశీ27మదనపూర్ణిమా30సంకష్టహరచతుర్థీమే 202104శుక్రమౌఢ్య త్యాగః, డొల్లు కర్తరీ…

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు

(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7 రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ…

శ్రీజయేంద్రవాణి – ప్రశ్నోత్తరములు 6

1. తులసిపూజ చేయు విధానమును తెలియగోరుచున్నాను?జ: తులసి మొక్కలో ముందు నీరు పోయవలెను. తరువాత కుంకుమ పెట్టి పుష్పము సమర్పించవలెను. తరువాత పాలు , పళ్ళు నైవేద్యము పెట్టి కర్పూరము వెలిగించి హారతి ఇవ్వవలెను. పిమ్మట మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించవలెను.తులసి…

ఈ మార్గశిరమాసంలో ముఖ్య తిథులు, పండుగలు (27-11-2019 నుండి 25-12-2019 వరకు )

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం27యాగః, తదుపర్యాగ్రయణమ్28యోగిరాజ దత్తావతారః, చంద్రదర్శనం(ఉత్తరశృఙ్గః)29రంభా వ్రతం, ప్రదోషః30వరచతుర్థీ(వరగణపతి/కపర్ది గణపతి వ్రతం)1నాగ పంచమీ2సుబ్రహ్మణ్య షష్ఠీ(పూజా/ఉపవాసశ్చ), శీతఘ్నదానాని, మల్లార షష్ఠీ(మల్లాసుర సంహారషష్ఠీ), ప్రదోషః3మిత్రసప్తమీ, నన్దాసప్తమీ(స్నానం దానం సర్వం తత్ర అక్షయం),ప్రదోషః, ద్విపుష్కరయోగః(ఉదయాది ప 02:17…

శివుని చిహ్నములు

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు(జగద్గురుబోధలనుండి) మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును…

సాంబమూర్తి

పరమాచార్యుల అమృతవాణి :‌ సాంబమూర్తి(జగద్గురుబోధలనుండి) సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం?…

దీపావళినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి(జగద్గురుబోధలనుండి) ఉల్కాదానం (దివిటీలు) దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి. లక్ష్మీపూజ దీపములు వెలిగించి అందు లక్ష్మిని…

దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?(జగద్గురుబోధలనుండి) పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం.…

నరకచతుర్దశినాడు ఏంచేయాలి?

పరమాచార్యుల అమృతవాణి :‌ నరకచతుర్దశినాడు ఏంచేయాలి (జగద్గురుబోధలనుండి) ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే|| సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము…

బ్రాహ్మణునకు ఉచితమైన వృత్తి

బ్రాహ్మణునకు ఉచితమైన వృత్తి (పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి) ప్రజలు జీవికకై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు, ఆ వృత్తులు తప్పు అనియో తక్కువ అనియో వాళ్ళు అనుకోవడంలేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాల హీనంగా పరిగణించేవారు.…

ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత

ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత (శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి) భారత ప్రజలు చాలా భాషలు మాట్లాడుతారు. ఆంధ్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడుతారు. తెలుగు నాడు లేక ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతను ప్రముఖ శివభక్తుడైన…

వేదం ఏం చెప్పుతోంది?

పరమాచార్యుల అమృతవాణి : వేదం ఏం చెప్పుతోంది ? వేదంయొక్క ఉద్దేశ్యం ఏమిటి? వేదం ఎందుకొరకు ఏర్పడ్డది? కొన్ని ఉపనిషత్తులు చెప్పినరీతిగా వేదాలన్నీ ఒకే వస్తువును చూపిస్తున్నవని తెలుస్తున్నది. ఆవస్తువేది? ఓంకారానికి అర్థముగా ఉండే ఒక పరమవస్తువునే వేదాలన్నీ చూపిస్తున్నవని ఉపనిషద్‌…

నువ్వులూ నీళ్ళూ ఎక్కడకువెళ్ళుతాయి?

పరమాచార్యుల అమృతవాణి : నువ్వులూ నీళ్ళూ ఎక్కడకు వెళ్ళుతాయి ?(జగద్గురుబోధలనుండి) మనిషికి మూడువిధాలైన ఋణము లున్నవి. మొదట దేవఋణం. రెండవది ఋషి ఋణం. మూడవది పితృ ఋణం. ఇవే కాక సంఘంలో ఉన్నందువలనఅతిథి అభ్యాగతులను ఆదరించవలసియున్నది. దీనిని మనుష్య యజ్ఞం అని…

ఈ ఆశ్వయుజమాసంలో ముఖ్య తిథులు, పండుగలు

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం29-09యాగః, శరన్నవరాత్రారంభః, దౌహిత్రకర్తృక మహాలయః, ద్విపుష్కరయోగః30-10ప్రీతి ద్వితీయా, చన్ద్రదర్శనం(ఉత్తరశృంగోన్నతిః)01-10భౌమచతుర్థీ (స్నాన దాన, శ్రాద్ధాదులు+ గణపతి పూజా మహా ఫలప్రదములు), స్తన్యవృద్ధి గౌరీ వ్రతం, ప్రదోషః02-10ఉపాంగలలితా వ్రతం03-10 నాగ పూజా04-10 బిల్వాభిమన్త్రనామ్, ప్రదోషః05-10అనధ్యాయః,…

వేదాంతము

పరమాచార్యుల అమృతవాణి : వేదాంతము(జగద్గురుబోధలనుండి) 'వేదాంతం' అనేమాట మనం తరచుగా వినేదే. పరిహాసానికి కూడా ఒకొక్కప్పుడు 'ఏమిటి? మహా వేదాంతం మాటాడుతున్నావే!' అని అంటాం. గీతలో శ్రీకృష్ణపరమాత్మ తన్ను గూర్చి-'వేదాంతకృ ద్వేదవిదేవచాహమ్‌' అని చెప్పుకున్నాడు. అంతం అంటే చివర. వేదాంతం అంటే…

శ్రవణ మనన నిదిధ్యాసములు

పరమాచార్యుల అమృతవాణి : శ్రవణ మనన నిదిధ్యాసములు(జగద్గురుబోధలనుండి) శ్రవణ మనన నిదిధ్యాసముల చేయవలసినదని మన ఉపనిషత్తులు ఆజ్ఞాపించుచున్నవి. కాని మనము వానిని ఎందుకు చేయవలసియునో విచారించెదము:- వాటిని మనము దర్శనముకొఱకు చేయవలయును. దర్శనముగానేమి? కంటితో చూచుటయే దర్శనమని మనకు అర్థము స్ఫురించుచున్నది. కాని…