అట్లతద్దె నోము కథ

అట్లతద్దె నోము కథ ఒక రాచచిన్నది తోడిచెలికతైలతో కలసి అట్లతద్దెనోమును నోచుటకు ఉపవాసముండెను. మూడు జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట ఆమె అన్నలు వచ్చి ఆమె యట్లు పడిపోవుటకు కారణమును తల్లివలన గ్రహించిరి, వారు తమ…

చల్ల చిత్త గౌరి నోము కథ

చల్ల చిత్త గౌరి నోము కథ చల్లచిత్తనోముచిత్త మారగ జేసి ఇల్లు వాకిళ్ళతో ఈశ్వర చింతతో చల్లనిబ్రతుకుతో సౌభాగ్యలక్ష్మితో, ఉల్లసంబుతోడ, నుండవే తల్లీ. ఈ మాటలనుకొని అక్షతలు వేసుకొనవలెను. చల్లచిలుకునప్పుడు కండ్లకంటుకొనిన చల్లబొట్లతో పసుపు కలిపి ప్రతిదినము ఐదుగురు పుణ్యంగనలకు బొట్లు…

ధైర్య గౌరి నోము కథ

ధైర్య గౌరి నోము కథ ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై…

రేగులగౌరినోము కథ

రేగులగౌరినోము కథ ఒక మహారాజునకు   సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య  ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు "అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు" అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి  వైష్ణవ రూపమున…

సహస్రఫలముల నోము కథ

సహస్రఫలముల నోము కథ ఒకనాడు పార్వతి శివుని నాథా! ఎల్లకాలము చేయు నోము వ్రతమేదని యడుగగా, ఆ స్వామి పార్వతీ! సహస్ర ఫలముల నోము ఎల్లకాలము చేయదగిన నోము. ఆ నోము చేసిన స్త్రీకి సర్వదేవతల దయయు కొంగు బంగారమైయుండునని చెప్పెను.…

భాద్రపద శుద్ధ నవమి: నన్దాదేవీ పూజా, కేదారవ్రతం

నన్దాదేవీ పూజా, కేదారవ్రతం భాద్రపదశుక్లనవమ్యాం నన్దాదేవీపూజా కార్యా| సా పరవిద్ధా గ్రాహ్యా| ఉక్తఞ్చ భవిష్యోత్తరే- మాసి భాద్రపదే యా స్యాన్నవమీ బహులే తథా| సా తు నన్దా మహాపుణ్యా కీర్తితా పాపనాశినీ|| ఇతి| అస్యాం కేదారవ్రతం కార్యం | సా మధ్యాహ్నవ్యాపినీ…

భాద్రపద శుద్ధ పాడ్యమి: శైవమౌనవ్రతము

శైవమౌనవ్రతము భాద్రపదశుక్లప్రతిపది శైవమౌనవ్రతం కార్యం| సా పూర్వవిద్ధాగ్రాహ్యా| ప్రతిపద్యప్యమావాస్యేతి యుగ్మవాక్యాత్| మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| సైవమౌనాహ్వయే గ్రాహ్యా వ్రతే సర్వార్థదాయినీ|| ఇతి| అస్యాం ప్రతిపద్యేవ మహత్తమవ్రతం కార్యం| తథా చోక్తం బ్రహ్మవైవర్తే- మాసి భాద్రపదే శుక్లే ప్రతిపత్పూర్వసంయుతా| మహత్తమాహ్వయే గ్రాహ్యా…

శ్రావణ బహుళ అమావాస్య: పోలాల అమావాస్య నోము

పోలాలఅమావాస్యనోము శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ నోము చేసుకోవాలి. శ్రావణమాసం మహిళలకు విశేషమైనమాసం. ఈ నెలలోనే శ్రావణమంగళవారాలు, మంగళగౌరీవ్రతాలు, శ్రావణశుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. ఇంకా శ్రావణమాసమంతా గౌరీదేవికి ప్రీతికరమైన నెల కాబట్టి సకల సంపత్ సౌభాగ్యాలని ప్రసాదించే…

శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్

కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీ ముత్తుస్వామిదీక్షితుల వరలక్ష్మీ దేవతా కృతి https://www.youtube.com/watch?v=pxS3uCJns5E శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్ రాగము : శ్రీ రాగము తాళము : రూపకతాళము పల్లవి: శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యమ్ వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే…

శ్రావణశుక్రవారము పాట

శ్రావణశుక్రవారము పాట కైలాసగిరియందు కైలాసవాసిని కైలాసపతితో కొలువుండగ ప్రమథాదిగణములు ప్రస్తుతింప పార్వతి అడిగె భక్తితో పరమేశ్వరునియిట్లు ||జయ మంగళం నిత్యశుభమంగళం|| ఏ పూజ,ఏవ్రతము,ఏ నోము భక్తులకు సర్వసంపదలిచ్చి వంశాభివృద్ధి నొందించును అనుచు పార్వతి పరమేశ్వరుని అడుగగా అతడీరీతి అనియెనిట్లు ||జయ|| కుండిన…

శ్రీ వరలక్ష్మీ వ్రత కథ

మందార పాటల పున్నాగ ఖర్జూరాది వృక్షములతో దట్టమైన అరణ్యముగల కైలాస శిఖరమున ప్రమథగణములు పరివేష్టించియుండ, లోకశంకరుడగు శంకరుడు, నవరత్నఖచితమగు సింహాసనమున పార్వతీ సమేతుడై ఆసీనుడైయుండెను. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులును, నారద అగస్త్య వాల్మీకి పరాశరాది మునిశ్రేష్టులును మహేశ్వరుని పర్యవేష్టించి…

శ్రావణమంగళవారము పాట

శ్రావణమంగళవారము పాట ఈశ్వర తనయునకు,పార్వతీపుత్రునకు గజాననునకు భక్తితోను, విభవమునిచ్చే వైభవదాయినిని వినుతింతునిన్ను వినయముగను ||జయమంగళం నిత్యశుభమంగళం|| మహిమీద వెలసిన మంగళగౌరిని మదిలోన కొలిచెద భక్తితోను పుడమిపైనొకరాజు సంతానహీనుడై పత్నితోగూడి కుములుచుండె ||జయ|| పరమేశ్వరుడంత జాలినొంది భూమీశుని ప్రాపుదమంచు భువికిదిగివచ్చె జంగమదేవరగా జగతికేతెంచి…

గండాల గౌరి నోము కథ

గండాల గౌరి నోము కథ ఒక ఊరిలో ఒక రాజుకూతురు ,మంత్రికూతురు గలరు. రాజకూతురు మంత్రి కూతురు కన్నా అన్ని విధముల ఎక్కువైనది. కాని మంత్రి కూతురుకన్న  ఘనత ఆమెకు లేదు. మంత్రికూతురు ధన, ధన్యాలకు, దాంపత్యమునుకు, పాడి పంటలకు, మణులవంటి బిడ్డలకు…

కన్నెతులసమ్మ నోము కథ

కన్నెతులసమ్మ నోము కథ  ఒక చిన్నది సవితితల్లిపోరు పడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెను. సవతితల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించెను . కాని అతడందుకు అంగీకరింపక, ఆమెనే వెళ్ళిపిల్లను తీసుకురమ్మని చెప్పెను . ఇంక చేయునది లేక ఆమె…

ఆషాఢ పూర్ణిమ:అన్నపానదానము

అన్నపానదానము అస్యాం పూర్ణిమాయాం అన్నపానాదిదానం విశేషతః కర్తవ్యమ్| సా పరవిద్ధా గ్రాహ్యా| తదుక్తం విష్ణుపురాణే - ఆషాఢభిర్యుతాయాం వై పూర్ణిమాయాం నృపోత్తమ | అన్నపానాదికం దత్వా నరస్త్వక్షయతాం వ్రజేత్ || ఇతి | ఈ ఆషాఢ పూర్ణిమ నాడు అన్నపానదానములను విశేషముగా…

ఆషాఢ పూర్ణిమ:శివశయన వ్రతము

అస్యాం సాయంకాలవ్యాపిన్యాం పూర్ణిమాయాం శివశయనాఖ్యవ్రతం కార్యమ్| తథా చోక్తం వామనపురాణే- పౌర్ణమాస్యాముమానాథస్స్వపతే చర్మసంస్తరే| వైయాఘ్రే చ జటాభారం సముద్గ్రధ్యాహివ్షర్మణా|| ఇతి | ఈ పూర్ణిమ నాడు సాయంకాల వ్యాపినిగా తిథియున్నప్పుడు శివశయనమను పేరుగల వ్రతమాచరించ వలెను . పూర్ణిమ సాయంకాలము సదాశివుడు…

ఆషాఢపూర్ణిమ : కోకిలా వ్రతము

అస్యాం పూర్ణిమాయాం కోకిలావ్రతం కార్యమ్| సా సాయాహ్నవ్యాపినీ గ్రాహ్యా| తథా చోక్తం హేమాద్రౌ భవిష్యే- ఆషాఢే పౌర్ణమాస్యాం తు సంధ్యాకాలే సమాగతే| సంకల్ప్య పూజాయేద్దేవీం కోకిలాఖ్యాం సుఖాయ వై|| ఆషాఢపూర్ణిమందే కోకిలా వ్రతమాచరించవలెను . సాయంకాలమునకు వ్యాపించిన తిథిని గ్రహింపవలెను .…

పెండ్లిగుమ్మడిగౌరి నోము కథ

పెండ్లిగుమ్మడిగౌరి నోము కథ పెండ్లిగుమ్మడినోము పెద్దక్కనోచింది గొల్లమందతోటి గొప్ప పంటతోటిబిడ్డ ఆటలతోటి పెద్ద దిక్కు తోటి , వడ్లగరిసెలతోటి , శుభ కార్యములతోటి నిత్యకల్యాణాల నెగడందుచుండెను.  ఉద్యాపన:మూడుగుమ్మడి పండ్లను తెచ్చిఒక దానిని మానెడుసోలెడుబియ్యముతో బ్రాహ్మణునకు వానిఇంటి దగ్గర దానమిచ్చి తాను పెండ్లి గౌరి…

తవుడుగౌరి నోము కథ

తవుడుగౌరి నోము కథ ఒక భాగ్యశాలి ఎనుబది ఏళ్ళ వృద్ధురాలై ఉన్నప్పటికీ ఆమె అత్తమామలనూ , తల్లితండ్రులనూ, బంధువులనూ , బిడ్డలనూ ఎడబాయక సంతోషముగానుండెను. ఆమెను చూసి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ " ఏమి నోచితివమ్మా ! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో…

కాటుకగౌరి నోము కథ

కాటుకగౌరి నోము కథఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను. ఆ త్రోవన పోవుచున్న పార్వతీదేవి"   ఏమమ్మా  విచారించుచున్నావు? "  అని అడిగెను . అందుకు ఆమె " అమ్మా నీవెవరివో తెలిసికొనుటకు నాకు  కండ్లు లేవు.  గ్రుడ్డిదానను , నన్ను…