ధర్మము… సూర్య గ్రహణం 21 Oct 2022 ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్యా మంగళవారము 25-10-2022 నాడు స్వాతీ నక్షత్రములో తులారాశి యందు కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవించును. స్పర్శకాలం పగలు గం 04:59 ని సూర్యాస్తమయ కాలం (హైదరాబాదు) సాయంకాలం గం. 05:45 ని మోక్షకాలం రాత్రి గం.…
ధర్మము దీపావళీ నిర్ణయః 21 Oct 2022 దీపావళీ నిర్ణయః 24-10-2022 సోమవారం చతుర్దశి సా 05:22 25-10-2022 మంగళవారం అమావాస్య సా 04:14 26-10-2022 బుధవారం ప్రతిపత్ ప 02:39దీపావళీతి సంజ్ఞా స్యాద్భూతాది త్రిదినం క్రమాత్ | ద్విజాతిభ్యో భవేద్దత్తం | సర్వం తత్రాక్షయం నృప || (మహాభారతే)…
ధర్మము… శ్రీ వరసిద్ధివినాయక పూజా (వినాయక చవితి పూజా) 30 Aug 202229 Sep 2022 ఇంటిలో తూర్పు భాగమున (లేక ఉత్తర భాగమున) ఒక ప్రత్యేక స్థలమందు - గోమయంతో అలికి, మ్రుగ్గుపెట్టి, దానిపై నొక పీట నుంచి, పీటకు పసుపు పూయవలయును. దానిపై అష్టదళ పద్మముగా పిండితో మ్రుగ్గువేసి, అందు నూతన వస్త్రమును వేయవలెను. అందు…
ధర్మము… జగద్గురువులు శంకరులు 5 May 20224 Aug 2022 పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు(జగద్గురుబోధలనుండి) తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆది శంకరులుమరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవం పోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం…
ధర్మము… రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి 21 Apr 2021 రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణ చేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతో సహా వివిధభాష్యాలను ఔపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా…
ధర్మము… ప్లవ నామ సంవత్సరంలో విశేష తిథులు, పండుగలు 18 Apr 202118 Apr 2021 (శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషంఏప్రిల్ 202113స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరాదిః, వసంత నవరాత్రారంభః, మేషసంక్రమణం14సౌరసంవత్సరాదిః15మాస గౌరీ వ్రతారంభః, మత్స్యజయన్తీ16గణేశదమన పూజా17లక్ష్మీ పంచమీ21సర్వేషాం శ్రీ రామనవమీ22ధర్మదశమీ23సర్వేషాం కామకైకాదశీ24వామన ద్వాదశీ25అనంగత్రయోదశీ27మదనపూర్ణిమా30సంకష్టహరచతుర్థీమే 202104శుక్రమౌఢ్య త్యాగః, డొల్లు కర్తరీ…
ధర్మము… మహామహిమాన్వితం ఆదిత్యస్తోత్రరత్నమ్ 14 Feb 202114 Feb 2021 ॥ శివావతారులు శ్రీమదప్పయ్యదీక్షితుల ఆదిత్యస్తోత్రరత్నమ్ ॥ మనుష్యుడు ప్రతిదినమూ సూర్యునియొక్క ఈ స్తోత్ర రత్నాన్ని ఒక్కసారైనా పఠించి దుస్స్వప్న ఫలమును, అపశకునములను, సమస్తమైన పాపమునూ చికిత్సచేయరాని రోగములనూ, చెడ్డస్థానములనందున్న సూర్యాదిగ్రహముల గణముచేత కలిగింపబడిన దోషాలను దుష్టములైన భూతాలను గ్రహములు మొదలైన వాటిని…
ధర్మము… ఆదిత్యహృదయస్తోత్రము 14 Feb 202114 Feb 2021 శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యము తో. తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః…
ధర్మము… పరమాచార్యుల అమృతవాణి : కార్తీక దీపము 30 Nov 202015 Dec 2020 పరమాచార్యుల అమృతవాణి : కార్తీక దీపము(జగద్గురుబోధల నుండి) కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ…
ధర్మము… విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2020 సంవత్సరములో నవరాత్రి అలంకారములు 16 Oct 202011 Nov 2020 శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి 17-10-2020 శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి 18-10-2020 శ్రీ గాయత్రి దేవి 19-10-2020 శ్రీ అన్నపూర్ణా దేవి 20-10-2020 శ్రీ సరస్వతి దేవి 21-10-2020 శ్రీ లలిత త్రిపురసుందరీ దేవి 22-10-2020 శ్రీ మహాలక్ష్మీ దేవి 23-10-2020…
ధర్మము… సుమతీ శతకము-40 13 Aug 2020 సుమతీ శతకము. క.కొక్కోకమెల్ల జదివినజక్కనివాడైన రాజ చంద్రుండైనన్మిక్కిలి రొక్కంబీయకచిక్కుదురా వారంకాంత | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ! పూర్తి ధనమేయకున్నచో, కొక్కోకుడు అనుకవి రుచించిన కామశాస్త్రము అంతటిని చదివినవాఅడైననూ రాజులలో శ్రేష్ఠుడైననూ గొప్ప అందగాడైననూ వెలయాలు సౌఖ్యము ఇవ్వదు. దానికి…
ధర్మము… వేమన శతకం – 39 12 Aug 2020 వేమన శతకం ఆ.మేక కుతికపట్టీ | మెడచున్న గుడువుగాఆక లేల మాను | నాశగాకలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము:ఓ వేమా! మేక యొక్క మెడను పట్టుకొని మెడక్రింద నుండు చన్నులను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు.…
ధర్మము… సుమతీ శతకము-39 10 Aug 2020 సుమతీ శతకము. క.కొంచెపు నరుసంగతిచేనంచితముగ గీడువచ్చు | నదియెట్లన్నన్గించిత్తు నల్లి కుట్టినమంచమునకు జేటువచ్చు | మహిలో సుమతీ! తాత్పర్యము : సుమతీ! అల్పబుద్ధిగల వానితో స్నేహము వలన ఎంతటి వారి కైనా ఏదో నొక సమయాన ఆపదలు సంభవించును. అది యెట్లనగా…
ధర్మము… వేమన శతకం – 38 4 Aug 2020 వేమన శతకం ఆ.గొడ్డుటావు బిదుక | గుండ గొంపపోయినపాలనీక తన్ను | బండ్లు రాలలోభివాని నడుగ | లాభంబు లేదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! గొడ్డుటావును పితుకుటకు వెళ్ళిననూ పెద్ద కుండను తీసికొని అది పాలీయ్దు పైగా పండ్లురాలిపోవునట్లుగా…
ధర్మము… సుమతీ శతకము-38 3 Aug 2020 సుమతీ శతకము. క.కూరిమిగల దినములలోనేరము లెన్నడును గలుగ| నేరవు, మఱి యాకూరిమి విరసంబైననునేరములే తోచుచుండు| నిక్కము సుమతీ! తాత్పర్యము : సుమతీ! ఒకరికి ఒకరు స్నేహముతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కన్పడవు. కాని ఆ స్నేహము చెడిన…
ధర్మము… వేమన శతకం – 37 1 Aug 2020 వేమన శతకం ఆ.కనియు గానలేడు | కదలింపడా నోరువినియు వినగలేడు| విస్మయమునసంపదగలవాని | సన్నిపాతంబిదివిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కంటితో చూచుచుండియు యథార్థమును తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదలించు ప్రయత్నము కూడా చేయడు. వినుచుండియు, ఆశ్చర్యము కలుగునట్లుగ విషయములను…
ధర్మము… సుమతీ శతకము-37 31 Jul 2020 సుమతీ శతకము. క.కులకాంత తోడ నెప్పుడుగలహింపకు, వట్టి తప్పు | ఘటియింపకుమీకలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటనుండ | నొల్లదు సుమతీ| తాత్పర్యము : చీటిమాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటినీరు క్రింద…
ధర్మము… వేమన శతకం – 36 30 Jul 2020 వేమన శతకం ఆ. కులము గలుగువారు| గోత్రంబు గలవారువిద్య చేత విఱ్ఱ| వీగు వారుపసిడిగల్గువాని| బానిస కొడుకులువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మంచి కులము నందు పుట్టిన వారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించు…
ధర్మము… సుమతీ శతకము-36 29 Jul 2020 సుమతీ శతకము. క.కారణములేని నగవునుబేరణమును లేని లేమ పృథివీస్థలిలోబూరణములేని బూరెయువీరణములేని పెండ్లి వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీయును, పూర్ణములేని బూరెయును, మంగళవాద్యములు లేని పెండ్లియును, ఇవి అన్నీ నిరుపయోగమైనవి. Sumati Shatakamu…
ధర్మము… వేమన శతకం – 35 28 Jul 2020 వేమన శతకం ఆ. కులములేనివాడు | కలిమిచే వెలయునుకలిమి లేనివాడు | కులము దిగునుకులముకన్నభువిని | కలిమి ఎక్కువసుమీవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కులము తక్కువవాడు అయినను సంపద ఉన్న యెడల గొప్పవాడుగా కీర్తి పొందును. భాగ్యము లేనివాడు…