ఈ కార్తిక శుక్ల పూర్ణిమా మంగళవారము 08-11-2022 నాడు భరణీ నక్షత్రములో మేషరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.
స్పర్శ కాలం పగలు గం 02:39
సూర్యాస్తమయం (హైదరాబాదు) సాయంకాలం గం 05:38
మోక్ష కాలం రాత్రి గం 06:19
మొత్తం పుణ్యకాలం గం 00:41
(గ్రహణ ఆరంభము ప గం. 02:39 అయినను పుణ్యకాలము సూర్యాస్తమయము నుండి ప్రారంభమగును.) .
నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము
గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజన మాచరేత్ | గ్రస్తోదయే భవేదిన్లోః దివా శ్రాద్ధం న కారయేత్ | రాత్రివపి తదా కుర్యాత్ ప్రత్యబ్దం మను రబ్రవీత్ ||
ఇత్యాది శాస్త్ర వాక్యములను బట్టి సమర్థులు ఈ రోజు పగలు ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. శుద్ధ మోక్షానన్తరము (రా 06:19 తరువాత) నిత్యభోజన, ప్రత్యాబ్దికములను ఈ రాత్రియే యథాప్రకారము జరుపుకొనవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం. 10:30 లోపు భుజింపవచ్చును.
ఈనాటి రాత్రికాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. అయితే విధవాకరృకశ్రాద్దమగుచో ఈ రోజు (పగలు – రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును. అట్లే ఈనాడు జరుపవలసిన విశేష పూజాదులన్నియు గ్రహణానంతరమే జరుపకొనవలెను. ఈ రోజు మహా కార్తికీ అలభ్యయోగము అగుట వలన ప్రాతఃకాలమున ఈ అలభ్యయోగ ప్రయుక్త స్నాన దానములు నిరభ్యంతరముగా చేసికొనవచ్చును.
గ్రహణ గోచారము :
ఈ గ్రహణమును భరణీ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.
శుభ ఫలము : మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులవారలకు
మధ్యమఫలము: సింహ, తుల, ధనుః, మీన రాశులవారలకు
అధమ ఫలము : మేష, వృషభ, కన్య, మకర రాశులవారలకు