సూర్య గ్రహణం

ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్యా మంగళవారము 25-10-2022 నాడు స్వాతీ నక్షత్రములో తులారాశి యందు కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవించును.

స్పర్శకాలం పగలు గం 04:59 ని

సూర్యాస్తమయ కాలం (హైదరాబాదు) సాయంకాలం గం. 05:45 ని

మోక్షకాలం రాత్రి గం. 06:29 ని

ఆద్యంత పుణ్యకాలం గం. 00:46 ని

 (మోక్షకాలం రాత్రి గం. 06:29 అయినను పుణ్యకాలము సూర్యాస్తమయము వరకే ఉండును.)

నిత్య భోజన ప్రత్యాబ్దికాదులు

గ్రస్తావేవాస్తమానం తు రవీన్దూ ప్రాప్నుతో యది | పరేద్యు రుదయే స్నాత్వా శుద్ధాం భ్యవహరే న్నరః || అహోరాత్రం న భుంజీత గ్రస్తావేవాస్తనౌ తు తౌ ||

ఇత్యాది శాస్త్రవాక్యములను బట్టి సమర్థులు ఈరోజు మొత్తం ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. 26-10-2022 నాడు శుద్ధబింబ దర్శనం చేసుకుని భోజనాదులను స్వీకరించవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం. 12:30 లోపు భుజింపవచ్చును. అలాగే రాత్రి ముక్తి స్నానానంతరము అపక్వాహారము తీసుకున్న మంచిది.

కాగా, ఈనాటి రాత్రి కాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. భోక్తలు, కర్తలు, కర్తలపత్నులు మాత్రమే శ్రాద్ధభోజనమునక అర్హులు. అలాగే శ్రాద్ధార్ధం మడి నీటి ఏర్పాటు, వంటచేయుట వంటివి అన్నీ కూడా కర్తలు, కర్తలపత్నులు మాత్రమే (మిగిలిన వారికి గ్రహణాశౌచము ఉన్నందున) చేసుకోవాలి. అయితే విధవాకర్తృకశ్రాద్ధ మగుచో ఈ రోజు (పగలు – రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును.

గ్రహణ గోచారము

ఈ గ్రహణమును స్వాతీ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.

శుభ ఫలము : వృషభ, సింహ, ధనుః, మకర రాశులవారలకు

మధ్యమఫలము : మేష, మిథున, కన్య, కుంభ రాశులవారలకు

అధమ ఫలము: కర్కాటక, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు

శుభమ్.

(కంచికామకోటిపీఠపంచాంగము నుండి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s