సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నుదిటి కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా
కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా
నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గల గలమని సవ్వడి చేయగ
సౌభాగ్య వతుల సేవలు నందగ
సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి
శుక్రవారపు పూజలు నందగా
సాయం సంధ్యా శుభ ఘడియలలో
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి
భక్తజనులకూ కల్పవల్లి
కమలాసనవై కరుణనిండగా
కనకవృష్టి కురిపించే తల్లి
జనకరాజుని ముద్దుల కొమరిత
రవికులసోముని రమణీమణివై
సాధుసజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చెడి దీవనలీయగ
కుంకుమ శోభిత పంకజలోచని
వెంకటరమణుని పట్టపురాణి
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మాయింట వెలసిన