శ్రీ వరలక్ష్మీ వ్రతము- విధి, కథ

వ్రతసామగ్రి : పసుపు, కుంకుమ, అక్షతలు, అగరువత్తులు, కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయలు – 2, రవిక గుడ్డ, తమలపాకులు, పళ్ళు, వక్కలు, గంధము, తోరములకు దారం.

పూజను ప్రారంభించుటకు ముందు తమ యింటికి తూర్పు భాగమును గోమయముతో అలికి శుభ్రపరిచి, అందు రంగవల్లులు (మ్రుగ్గు)ను తీర్చి, అందు ఒక పీట లేదా మందిరము ఉంచవలయును. ఆ మందిరమును పచ్చని తోరణముతో కనులపండుగగా నలంకరించవలయును, పీఠము (పీట) మీద ఎనిమిది దళములుగల పద్మమును బియ్యపు పిండితో రాయవలెను. దానిపై నూతన వస్త్రమొకటి పెట్టవలెను. దానిపై శక్తికొలది బియ్యము పరచి, దానిపై రాగి పాత్ర నుంచవలయును. ఆ కలశములో బియ్యము నింపవలెను. అందు పంచ పల్లవములుంచి, దానిపై నారికేళ ఫలమును మూర్తి స్వరూపముగా అలంకరించిపెట్టి, క్రొత్త రవిక గుడ్డ దానికి చుట్టవలయును. మంటపమునకు దక్షిణభాగమున అఖండ దీపారాధన నుంచవలెను. పిదప పూజను ఆరంభించవలెను.

శ్రీరస్తు

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ వరలక్ష్మీ వ్రత పూజ

శ్లో|| సర్వేష్వారంభ కార్యేషు, త్రయ స్త్రి భువనేశ్వరాః|
దేవాదిశంతు న స్సిద్ధిం, బ్రహ్మేశాన జనార్దనాః||
(అని ప్రార్థించి)
విష్ణు ర్విష్ణు ర్విష్ణుః అని విష్ణువును స్మరించవలయును.

పురాణాచమనం కృత్వా : ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,

కేశవాయ నమః
నారాయణాయ నమః
మాధవాయ నమః
(అనుచు మూడుమ్మారు కుడి హస్తమున జలము గ్రహించి ఆచమించవలయును)
గోవిందాయ నమః
ఇతి హస్తం ప్రక్షాల్య (అని హస్తములను కడిగికొని)
విష్ణవే నమః
ఇతి నేత్రయోః ఉదకస్పర్శనం కృత్వా (అని రెండు కండ్లను తడిచేతితో తుడిచికొని)
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
అని నామావళి పఠించుచు విష్ణువును స్మరించునది.

మంగళోచ్చారణం

 1. శ్రీ మన్మహాగణాధిపతయే నమః
 2. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
 3. శ్రీ వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
 4. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః
 5. సీతారామాభ్యాం నమః
 6. శచీ పురన్దరాభ్యాం నమః
 7. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
 8. కుల దేవతాభ్యో నమః
 9. మాతాపితృభ్యాం నమః
 10. పతిచరణారవిందాభ్యాం నమః
 11. సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ నమః
  నిర్విఘ్నమస్తు, పుణ్యాహం దీర్ఘ మాయురస్తు
  (అని స్మరించవలయును)

భూతోఛ్చాటనం:
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతేభూమి భారకాః|
ఏతాషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే||

(అని ఉదకమును తనకు చుట్టును చల్లవలయును)

ప్రాణాయామము
ఎడమ ముక్కరమును మూసి, కుడిముక్కరముతో ‘యం’ అను వాయు బీజమును 4 మాఱ్లు స్మరించుచు వాయువును లోనికి పీల్చి; వాయువును కుంభించి ‘రం’ అను అగ్ని బీజమును 16 మాఱ్లు మానసికముగ పఠించి; ‘యం’ అను వాయు బీజమును 8 మాఱ్లు మానసికముగ పఠింపుచు ఎడమ ముక్కరముతో వాయువును విడువవలయును.

సంకల్పః

 1. దేశ సంకీర్తనము :- పంచాశత్కోటి యోజన విస్తీర్ణ మహీ మండలే, లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య (ఆగ్నేయ, …) ప్రదేశే, కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే (గంగా కావేర్యోర్మధ్యదేశే, …), స్వగృహే (బంధుగృహే, వసతిగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ చరణ సన్నిధౌ||
 2. కాల సంకీర్తనము:- శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన …. సంవత్సరే, ఉత్తరాయణే(దక్షిణాయనే), ….ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, …..తిథౌ,శుక్రవాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే.
 3. సంకల్పం:– శ్రీమతీ …. గోత్రవతీ …. నామధేయవతీ అహం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం,అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారోగ్య, ఐశ్వర్యాభివృధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్యఫలావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్తామ్, వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య, వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణకల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే||
  (అని కుడి అనామికతో జలమును తాకి)

దీపారాధనమ్:
ఘృతాక్త వర్తిభిర్దీపం ప్రజ్వాల్య ధ్యాయేత్|
నేతిని పోసి దీపము వెలిగించి దీప స్తంభము నలంకరించి, ఈ క్రింద మంత్రముతో ధ్యానించుము. పూజించుము.
శ్లో॥దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః|
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే

దీప దేవతాభ్యోనమః , సకల పూజా పరిపూర్ణార్థం గంధాక్షత పుష్పాణి సమర్పయామి.

కలశ పూజా:
తదంగ కలశారాధనం కరిష్యే|| (అని సంకల్పించి)
( తాను ఆచమించుటకు ఉపయోగించు పాత్రలోని జలము దేవతకు ఉపయోగించరాదు. పీటమీదగాని భూమిమీదగాని జలముతో శుద్ధిచేసి అందు ఒక పత్రము(ఆకు) పెట్టి, దానిపై కలశ ముంచవలెను. రాగి, స్టీలు పాత్రలు మంచివికావు. వెండిపాత్రగాని, కంచువిగాని, యిత్తడివి గాని ఉపయోగించవచ్చును.)
కలశమలంకృత్య, (కలశమును గంధము, కుంకుమతో అలంకరించి)
శుద్ధోదకేన కలశమాపూర్య, (శుద్ధజలముతో కలశము నింపి)
గంధపుష్పాక్షతైరభ్యర్చ్య, (కలశములో జలమును గంధము, పుష్పము, అక్షతలను ఉంచి)
(కలశముపై కుడిహస్తమునుంచి ఇట్లు పఠించవలెను)

శ్లో|| కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్స్మృతాః||
శ్లో|| కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా|
ఋగ్వేదోఽథ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః||
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః||
శ్లో|| గంగేచ ! యమునే! కృష్ణే! గోదావరి! సరస్వతి!|
నర్మదే! సింధు కావేర్యౌ ! జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
ఆయాంతు శ్రీ
వరలక్ష్మీ దేవతా పూజార్థం మమ దురితక్షయ కారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవీమాత్మానం చ సంప్రోక్ష్య||
(కలశోదకమును, అందలి పుష్పముతో దేవీ ప్రతిమ మీదను, తన శిరస్సునను, పూజాద్రవ్యముల పైనను చల్లుకొనవలెను)
(తొమ్మిది పోగులతో కూడి, తొమ్మిది ముళ్ళు వేయబడిన తోరమును పసుపుతో నలంకరించి దేవత సన్నిధిలో నుంచుము)

గణాధిపతి పూజా

పసుపు ముద్దతో గణపతి ప్రతిమను చేసుకొని తమలపాకుమీద ఉంచి దానిని పూజించవలెను.

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే(అని అనామికతో జలమును స్పృశించవలెను)

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ( మహా గణాధిపతిని ధ్యానించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. (అక్షతలతో)
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.(అక్షతలతో)
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి. (కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.(కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారికస్నానం సమర్పయామి. (కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.(అక్షతలతో)
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి. (గంధమును ధరింపజేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాన్ సమర్పయామి. (అక్షతలతో)
శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి – (పుష్పములతో పూజించవలెను)
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదన్తాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయనమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః

శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి. (ధూపం చూపించవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. (దీపం దర్శింపజేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః యథాశక్తి __ నివేదనం సమర్పయామి. (నైవేద్యం సమర్పించవలెను)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (కలశోదకముతో)
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. (తాంబూలం – మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు పెట్టి స్వామికి సమర్పించవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ|
అవిఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా||

శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. (ఒక పుష్పం తీసుకుని పైన చెప్పిన శ్లోకం చదివి ఆ పుష్పాన్ని స్వామికి సమర్పించవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి.
సర్వోపచారపూజాః సమర్పయామి. (అక్షతలతో)
శ్లో|| యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం||
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప|
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే||

అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతిః సుప్రసన్నో వరదో భవతు| (అని అక్షతలు పువ్వులతో కూడ నీళ్ళు విడువవలసినది.)

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (పూజాక్షతలు శిరసున ధరించవలెను).

శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ( గణపతి ఉన్న తమలపాకు కొసను కొంత తూర్పుగా జరుపవలెను). శోభనార్థే పునరాగమనాయచ.

అథ వరలక్ష్మీదేవతాపూజా

శ్రీవరలక్ష్మీదేవతాపూజను ఆరంభించవలెను.

ప్రాణ ప్రతిష్ఠా:
(కుడి హస్తములో పుష్పముంచుకుని దేవతా ప్రతిమ పై నుంచి ఈ క్రింది మంత్రమును పఠించునది.)
ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం, హంసః శ్రీవరలక్ష్మీదేవతా స్థిరాభవతు , సుప్రసన్నా భవతు , వరదా భవతు “|
(ఇట్లు ప్రాణప్రతిష్ఠ గావించి పుష్పము దేవతపైనే ఉంచునది)

అథ ధ్యానం
శ్లో|| పద్మాసనే! పద్మకరే ! సర్వలోకైక పూజితే!|
నారాయణప్రియే ! దేవి! సుప్రీతా భవసర్వదా||
శ్లో|| క్షీరోదార్ణవ సంభూతే ! కమలే ! కమలాలయే !|
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి.
(అని ధ్యానము చేసి పుష్పాంజలి సమర్పించి).

షోడశోపచార పూజా

ఆవాహనమ్:-
శ్లో|| సర్వమంగళమాంగళ్యే ! విష్ణువక్షస్థలాలయే|
ఆవాహయామి దేవి! త్వాం సుప్రీతాభవ సర్వదా||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి|(ప్రతిమపై అక్షతలనుంచుము)

ఆసనం:-
శ్లో|| సూర్యాయుతనిభ స్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితమ్|
సింహాసన మిదం దేవి! స్థీయతాం సురపూజితే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి|(అక్షతలతో)

పాద్యం:-
శ్లో||సువాసితజలం రమ్యం సర్వతీర్థసాముద్భవమ్!
పాద్యం గృహాణ దేవి! త్వం సర్వదేవ నమస్కృతే!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి. (కలశోదకంతో)

అర్ఘ్యమ్:-
శ్లో|| శుద్ధోదకం చ పాత్రస్థం గన్ధపుష్పాది మిశ్రితమ్|
అర్ఘ్యం దాస్యామి తే దేవి! గృహాణ సురపూజితే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి|(కలశోదకంతో)

ఆచమనీయం:-
శ్లో|| సువర్ణకలశాఽఽనీతం చన్దనాఽగరు సంయుతమ్|
గృహాణాచమనం దేవి! మయాదత్తం శుభప్రదే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (కలశోదకం)

మధుపర్కః:-
(మధుపర్కమనగా ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె మిశ్రితము)
శ్లో|| స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధు ప్లుతమ్|
మధుపర్కం గృహాణేదం మయా దత్తం సురేశ్వరి!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మధుపర్కం సమర్పయామి.
మధుపర్కానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

పంచామృత స్నానం:-
(పంచామృతములు – ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, శర్కర మిశ్రితము ; ఇవి లేనిచో కలశ జలముతో చేయునది)
శ్లో|| పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతమ్|
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి.

స్నానం:-
శ్లో|| గంగా జలం మయాఽఽనీతం మహాదేవ శిరః స్థితమ్|
శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

వస్త్రం:-
శ్లో||సురాఽర్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే|
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. (వస్త్రం లేనిచో తదర్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించవలెను)
వస్త్రయుగ్మానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

ఆభరణం:-
శ్లో||కేయూర కంకణే దివ్యే హార నూపుర మేఖలాః|
విభూషణా న్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నానావిధ ఆభరణాని సమర్పయామి.(ఆభరణం లేనిచో తదర్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించవలెను)

యజ్ఞోపవీతం:-
శ్లో|| తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్ |
ఉపవీతం మిదం దేవి! గృహాణ త్వం శుభప్రదే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ( యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించవలెను)
యజ్ఞోపవీతానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

గంధః:-
శ్లో||కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభి రన్వితమ్|
గంధం దాస్యామ్యహం దేవి! ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శ్రీగంధాన్ ధారయామి . (గంధమును ధరింపజేయవలెను)
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమ తిలకం ధారయామి.(గంధము పైన కుంకుమ పెట్టవలెను)

అక్షతాః:-
శ్లో|| అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాం స్తండులాన్ శుభాన్|
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతా మబ్ధిపుత్రికే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలతో)

పుష్పాణి:-
శ్లో|| మల్లికాజాతి కుసుమైశ్చంపకై ర్వకుళై రపి|
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి. (పుష్పములతో పూజించవలెను )

అథ అంగపూజా
హ్రీం చంచలాయై నమః|పాదౌ పూజయామి|
హ్రీం చపలాయై నమః|జానునీ పూజయామి|
హ్రీం పీతాంబరాయై నమః|ఊరూ పూజయామి|
హ్రీం కమలవాసిన్యై నమః|కటిం పూజయామి|
హ్రీం పద్మాలయాయై నమః |నాభిం పూజయామి|
హ్రీం మదనమాత్రే నమః|స్తనౌ పూజయామి|
హ్రీం లలితాయై నమః|భుజద్వయం పూజయామి|
హ్రీం కంబుకంఠ్యై నమః|కంఠం పూజయామి|
హ్రీం సుముఖాయై నమః|ముఖం పూజయామి|
హ్రీం శ్రియై నమః|ఓష్ఠౌ పూజయామి|
హ్రీం సునాసికాయై నమః|నాసికాం పూజయామి|
హ్రీం సునేత్రాయై నమః|నేత్రే పూజయామి|
హ్రీం రమాయై నమః|కర్ణౌ పూజయామి|
హ్రీం కమలాయై నమః|శిరః పూజయామి|
హ్రీం శ్రీ వరలక్ష్మ్యై నమః|సర్వాణ్యంగాని పూజయామి|

అత్ర లక్ష్మీ అష్టోత్తరశతనామాభిః పూజా కర్తవ్యా|

హ్రీం ప్రకృత్యై నమః
హ్రీం వికృతై నమః
హ్రీం విద్యాయై నమః
హ్రీం సర్వభూతహితప్రదాయై నమః
హ్రీం శ్రద్ధాయై నమః
హ్రీం విభూత్యై నమః
హ్రీం సురభ్యై నమః
హ్రీం పరమాత్మికాయై నమః
హ్రీం వాచే నమః
హ్రీం పద్మాలయాయై నమః
హ్రీం పద్మాయై నమః
హ్రీం శుచయే నమః
హ్రీం స్వాహాయై నమః
హ్రీం స్వధాయై నమః
హ్రీం సుధాయై నమః
హ్రీం ధన్యాయై నమః
హ్రీం హిరణ్మయ్యై నమః
హ్రీం లక్ష్మ్యై నమః
హ్రీం నిత్యపుష్టాయై నమః
హ్రీం విభావర్యై నమః
హ్రీం అదిత్యై నమః
హ్రీం దిత్యై నమః
హ్రీం దీప్తాయై నమః
హ్రీం వసుధాయై నమః
హ్రీం వసుధారిణ్యై నమః
హ్రీం కమలాయై నమః
హ్రీం కాన్తాయై నమః
హ్రీం కామాక్ష్యై నమః
హ్రీం క్రోధసంభవాయై నమః
హ్రీం అనుగ్రహప్రదాయై నమః
హ్రీం బుద్ధయే నమః
హ్రీం అనఘాయై నమః
హ్రీం హరివల్లభాయై నమః
హ్రీం అశోకాయై నమః
హ్రీం అమృతాయై నమః
హ్రీం దీప్తాయై నమః
హ్రీం లోకశోకవినాశిన్యై నమః
హ్రీం ధర్మనిలయాయై నమః
హ్రీం కరుణాయై నమః
హ్రీం లోకమాత్రే నమః
హ్రీం పద్మప్రియాయై నమః
హ్రీం పద్మహస్తాయై నమః
హ్రీం పద్మాక్ష్యై నమః
హ్రీం పద్మసుందర్యై నమః
హ్రీం పద్మోద్భవాయై నమః
హ్రీం పద్మముఖ్యై నమః
హ్రీం పద్మనాభ ప్రియాయై నమః
హ్రీం రమాయై నమః
హ్రీం పద్మమాలాధరాయై నమః
హ్రీం దేవ్యై నమః
హ్రీం పద్మిన్యై నమః
హ్రీం పద్మగన్ధిన్యై నమః
హ్రీం పుణ్యగంధాయై నమః
హ్రీం సుప్రసన్నాయై నమః
హ్రీం ప్రసాదాభిముఖ్యై నమః
హ్రీం ప్రభాయై నమః
హ్రీం చన్ద్రవదనాయై నమః
హ్రీం చన్ద్రాయై నమః
హ్రీం చంద్రసహోదర్యై నమః
హ్రీం చతుర్భుజాయై నమః
హ్రీం చంద్రరూపాయై నమః
హ్రీం ఇన్దిరాయై నమః
హ్రీం ఇన్దుశీతలాయై నమః
హ్రీం ఆహ్లాదజనన్యై నమః
హ్రీం పుష్ట్యై నమః
హ్రీం శివాయై నమః
హ్రీం శివకర్యై నమః
హ్రీం సత్యై నమః
హ్రీం విమలాయై నమః
హ్రీం విశ్వజనన్యై నమః
హ్రీం తుష్ట్యై నమః
హ్రీం దారిద్ర్యనాశిన్యై నమః
హ్రీం ప్రీతిపుష్కరిణ్యై నమః
హ్రీం శాన్తాయై నమః
హ్రీం శుక్లమాల్యాంబరాయై నమః
హ్రీం శ్రియై నమః
హ్రీం భాస్కర్యై నమః
హ్రీం బిల్వనిలయాయై నమః
హ్రీం వరారోహాయై నమః
హ్రీం యశస్విన్యై నమః
హ్రీం వసుంధరాయై నమః
హ్రీం ఉదారాంగాయై నమః
హ్రీం హరిణ్యై నమః
హ్రీం హేమమాలిన్యై నమః
హ్రీం ధనధాన్యకర్యై నమః
హ్రీం సిద్ధయే నమః
హ్రీం స్త్రైణసౌమ్యాయై నమః
హ్రీం శుభప్రదాయై నమః
హ్రీం నృపవేశ్మగతానందాయై నమః
హ్రీం వరలక్ష్మ్యై నమః
హ్రీం వసుప్రదాయై నమః
హ్రీం శుభాయై నమః
హ్రీం హిరణ్యప్రాకారాయై నమః
హ్రీం సముద్రతనయాయై నమః
హ్రీం జయాయై నమః
హ్రీం మంగళాదేవ్యై నమః
హ్రీం విష్ణువక్షస్థలస్థితాయై నమః
హ్రీం విష్ణుపత్న్యై నమః
హ్రీం ప్రసన్నాక్ష్యై నమః
హ్రీం నారాయణ సమాశ్రితాయై నమః
హ్రీం దారిద్ర్యధ్వంసిన్యై నమః
హ్రీం దేవ్యై నమః
హ్రీం సర్వోపద్రవవారిణ్యై నమః
హ్రీం నవదుర్గాయై నమః
హ్రీం మహాకాళ్యై నమః
హ్రీం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
హ్రీం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
హ్రీం భువనేశ్వర్యై నమః

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి |
(బిల్వ దళములు, తామరపూల రేకులు, దవనము, మరువము మున్నగు సుగన్ధపుష్పములు, కుంకుమ లక్ష్మీదేవి పూజకు ప్రశస్తములు)

ధూపం:-
శ్లో|| దశాంగం గుగ్గులోపేతం సుగంధిమ్ చ మనోహరమ్|
ధూపం దాస్యామి దేవేశి! వరలక్ష్మి! గృహాణతమ్||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి.(ధూపం చూపించవలెను)

దీపం:-
శ్లో|| ఘృతాక్తవర్తి సమ్యుక్తం అంధకార వినాశకమ్|
దీపం దాస్యామి తే దేవి! గృహాణ ముదితా భవ||

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః దీపమ్ దర్శయామి.(దీపం దర్శింపజేయవలెను)
ధూపదీపానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి.(కలశోదకముతో)

నైవేద్యం:-
దేవతకు ఎదుట జలము చల్లి, పిండి ముగ్గు, గంధము, కుంకుమతో చతురస్ర మండలము చేయవలెను. అందు వండిన పదార్థములను ఉంచి నైవేద్యపాత్రలు గల పళ్ళెములను, నెయ్యి, పెరుగు, సెనగలు, ఫలములు మొదలగు వానిని ఉంచుము. వండిన నైవేద్య పదార్థములపై నేతితో అభిఘరించుము.
ఉద్ధరిణెతో కలశపాత్రలోని జలము తీసుకొని, గౌరీ పంచాక్షరీ మంత్రముతోగాని, ఉపదేశము లేని యడల యీ క్రింది మంత్రముతోగాని జలము నభిమంత్రించి,
శ్లో|| యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాదిగోచరాః|
ప్రేరయే త్తస్య యద్భర్గ స్తద్వరేణ్య ముపాస్మహే||

(పదార్థములపై ఆ జలమును చల్లి) అని సూర్యుని స్మరించి, కలశపాత్ర నుండి దేవికి ఆచమనీయము ఇచ్చి-
శ్లో|| నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతమ్|
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే||
( అని ప్రార్థించి)
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి.
ప్రాణాయ నమః| అపానాయ నమః| వ్యానాయ నమః| ఉదానాయ నమః| సమానాయ నమః|| ( అనుచు పదార్థములి దేవికి నివేదించి ఇంచుక సేపు దేవిని ధ్యానించి)ఇతి నైవేద్యం సమర్ప్య –
నైవేద్యానన్తరం ఉత్తరాపోశనం సమర్పయామి|
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్|
పానీయం గృహ్యతాం దేవి ! శీతలం సుమనోహరమ్||
(అని పఠించి)
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః హస్తౌప్రక్షాలయామి| పాదౌప్రక్షాలయామి| (అనుచు జలమునిచ్చి)
శుద్ధాచమనీయం సమర్పయామి|(అనుచు జలమునిచ్చి)

తాంబూలం:-
శ్లో|| పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం|
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్||

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః తాంబూలం సమర్పయామి.(తాంబూలం – మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు పెట్టి స్వామికి సమర్పించవలెను)

నీరాజనం:-
శ్లో|| నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్|
తుభ్యం దాస్యామ్యహం దేవి! గృహ్యతాం విష్ణువల్లభే!||

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)

మంత్రపుష్పం:-(పుష్పాక్షతలను పుచ్చుకొని, నిలుచుండి)
శ్లో|| లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామెశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురామ్|
శ్రీమన్మందకటాక్ష లబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్||
శ్లో|| శుద్ధలక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ|
శ్రీలక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా||
శ్లో||వరాంకుశౌపాశమభీతి ముద్రాం
కరైర్వహంతీం కమలాసనస్థామ్|
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్||
శ్లో||సర్వమంగళమాంగళ్యే !శివే ! సర్వార్థసాధికే|
శరణ్యే! త్ర్యంబకే ! దేవి! నారాయణి !నమోఽస్తుతే||
శ్లో|| పద్మాసనే ! పద్మకరే! సర్వలోకైకపూజితే!|
నారాయణప్రియే ! దేవి! సుప్రీతా భవసర్వదా||

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. (అని చేతిలోని పుష్పాక్షతలను దేవిపాదములపై నుంచి)

ఆత్మప్రదక్షిణ నమస్కారాః:-
శ్లో|| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే||

శ్లో|| నమస్త్రైలోక్యజనని! నమస్తే విష్ణువల్లభే!
త్రాహి మాం భక్తవరదే! వరలక్ష్మి! నమోనమః||
(అని ముమ్మారు ఆత్మ ప్రదక్షిణ మొనర్చి)
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి|

శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఛత్రం సమర్పయామి|
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః చామరం వీజయామి |
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః నృత్యం దర్శయామి |
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః గీతం శ్రావయామి|
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః వాద్యం ఘోషయామి|
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆందోళికా మారోహయామి|
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః అశ్వాన్ ఆరోహయామి|
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః గజాన్ మారోహయామి|
సమస్తరాజోపచారాన్ దేవోపచారాంశ్చ సమర్పయామి||

అథ తోర గ్రంథి పూజా
(ఇది వరకు దేవతవద్దనుంచి తొమ్మిది ముళ్ళుగల తోరమును ఏ ముడికి ఆ ముడి విడిగా కనబడునట్లు పెట్టి, ఒక్కొక్క ముడిని పూజించవలెను.)
హ్రీం కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి
హ్రీం రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి
హ్రీం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి
హ్రీం విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి
హ్రీం మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి
హ్రీం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి
హ్రీం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి
హ్రీం చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి
హ్రీం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి
(అని పూజించి కుడిచేతికి తోరమును యీ క్రింది మంత్రముతో కట్టుకొనవలెను.)
శ్లో|| బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదమ్|
పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే!||

వాయనదానం:
పై విధముగా వరలక్ష్మిని పూజించి, పండ్రెండు భక్ష్యములతో కూడిన వాయనమును బ్రాహ్మణునకొసగవలయును.
వాయనదానము చేయునపుడు చెప్పవలసిన మంత్రము:
శ్లో|| ఇందిరా ప్రతి గృహ్ణాతి ఇందిరా వై దదాతి చ|
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః||

సమర్పణం:-
శ్లో|| యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరి !||
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి!|
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు తే || (
అని పఠించి, అక్షతలు, జలము చేతగొని)

అనయా కల్పోక్తప్రకారేణ మయా కృతయా షోడశోపచార పూజయా భగవతీ సర్వదేవాత్మికా శ్రీ వరలక్ష్మీదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు|| మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు||ఇతి జలం విసృజేత్ | (అని జలం వదిలవలయును).
పూజావిధి సమాప్తం.

కథా ప్రారంభం:

మందార పాటల పున్నాగ ఖర్జూరాది వృక్షములతో దట్టమైన అరణ్యముగల కైలాస శిఖరమున ప్రమథగణములు పరివేష్టించియుండ, లోకశంకరుడగు శంకరుడు, నవరత్నఖచితమగు సింహాసనమున పార్వతీ సమేతుడై ఆసీనుడైయుండెను. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులును, నారద అగస్త్య వాల్మీకి పరాశరాది మునిశ్రేష్టులును మహేశ్వరుని పర్యవేష్టించి యుండిరి. అట్టి సమయమున సర్వమంగళప్రద యగు గౌరీదేవి, లోకానుగ్రహార్థము సంప్రీతిగలదై శంకరునితో ఇట్లనెను. “సమస్తలోకమును ఏలుచు, సకలప్రాణులయందు దయగలిగిన ఓ భగవంతుడా! రహస్యము, పుణ్యప్రదము అగు ఒక శుభవ్రతమును నాకెరింగింపుము” అని కోరగా ఈశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పదొడగెను. “ఓ పార్వతీ! వ్రతములలోకెల్ల ఉత్తమమైనది యగు వ్రతమొక్కటి కలదు. దానిని నీకు చెప్పెదను. అది సమస్త సంపదలకూ మూలమైనది. సర్వసౌభాగ్య హేతువు. శీఘ్రముగనే పుత్ర పౌత్ర సంతతినొసంగునది. ఈ పుణ్యవ్రతమును వరలక్ష్మీవ్రతమందురు. ఈ వ్రతమును శ్రావణమాసమున పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారమునాడు ఆచరింపవలెను. ఆ వ్రతమాచరించు స్త్రీకి గలుగు పుణ్యఫలమును చెప్పెదను. ఆలకింపుము” అని పార్వతితో శంకరుడు చెప్పగా, గౌరి శివునిచూచి “నాథా! ఆ వ్రతము చేయు విధానమేమి ? ఆ వ్రతమున ఏ దేవతను పూజించవలెను ? ఆ దేవిని ఇంతకు పూర్వమెవరు ఆరాధించి సంతోషపెట్టిరి ? ” అని అడిగెను. అపుడు ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పెను.

ఓ పార్వతీ! పవిత్రమగు వరలక్ష్మీ వ్రత ప్రభావంబు సవిస్తరముగ చెప్పెదనాలకింపుము. మగధదేశమున కుండినమను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గలిగి శోభాయమానమగు ఇండ్లతోను ఒప్పుచుండును. అందు చారుమతియను ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె పతిభక్తి కలిగి అత్తమామలకు శుశ్రూష చేయుచుండెను. గృహకార్యములను చక్కగా నిర్వర్తించుచుండెను. సౌందర్యవతి. అన్ని శాస్త్రములను జదివినది. ఎల్లప్పుడు ఇంపుగా మాటాడునది. నిర్మలమైన మనస్సు గలది.

ఒకనాటి రాత్రి ఆమెకు స్వప్నమందు లక్ష్మీదేవి ప్రత్యక్షమై “ఓ కళ్యాణీ! ఇటురమ్ము. నీకు శుభమగును. నేను వరలక్ష్మీదేవిని వచ్చితిని. శ్రావణమాసమున పౌర్ణమికి ముందుగా వచ్చు శుక్రవారమున నన్ను పూజించుము. నీవు కోరు వరములిచ్చెదను ” అని చెప్పగా చారుమతి స్వప్నమందే యా వరలక్ష్మీదేవిని ఆనందముతో ఇట్లు స్తుతించెను.

నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే
శరణ్యే ! త్రి జగద్వన్ద్యే ! విష్ణువక్షస్థలాలయే ! ||
త్వయాఽవలోకితః సద్యః స ధన్యః సుగుణాన్వితః
స శ్లాఘ్యః స కుటుంబీచ స చ శూరః స చ పండితః ||
జన్మాంతర సహశ్రేషు కిం మయా సుకృతం కృతమ్
అత స్త్వత్పాదయుగళం పశ్యామి హరి వల్లభే ! ||


(తాత్పర్యము) జగములకన్నింటికినీ తల్లివి. పుణ్యస్వరూపురాలవు. నీకు నమస్కారము. శరణుజొచ్చిన వారిని కాపాడుదానవు. ముల్లోకముల వారిచేత కొనియాడదగినదానవు. విష్ణువుయొక్క హృదయమే నివాసముగా గలదానవు. నీవెవరిని కటాక్షముతో జూతువో, ఆ మానవుడే ధన్యుడు. అతడే సుగుణులముతో కూడినవాడగును. అతడే కొనియాడదగినవాడు. అతడే ఉత్తమ కుటుంబీకుడు. అతడే శూరుడు. అతడే పండితుడు. ఓ హరిప్రియురాలా! పెక్కు వేల జన్మములందు ఎంత పుణ్యము చేసితినో గదా! లేనియెడల నీ పాదకమలముల దర్శనము నాకు లభించునా ?”

అని వరలక్ష్మీదేవిని బహువిధముల స్తుతించెను. ఆ వరలక్ష్మీదేవియు నా చారుమతిచే ఇట్లు స్తోత్రము చేయబడినదై సంతుష్టి చెంది ఆమెకు పెక్కు వరములనొసగి అంతర్థానమయ్యెను.

పిమ్మట సాధ్వియగు చారుమతి స్వప్నమునుండి మేల్కాంచినదై సూర్యోదయమైన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు దెలిపెను. బంధువులునూ “నీవు శుభకరమగు స్వప్నమును గంటివి. మంచిది. మనమందరము వరలక్ష్మీదేవి ఆజ్ఞానుసారము చేయుదము ” అని పలికిరి. ఇట్లు నిశ్చయించుకున్నవారై శ్రావణ పౌర్ణమి ముందువచ్చు శుక్రవారము ఎప్పుడు వచ్చునా అని నిరీక్షించుచుండిరి. వారి పుణ్యఫలవశమున వరలక్ష్మీ వ్రతదినము ప్రాప్తించెను. ఆ స్త్రీలందరు ఆనందోత్సాహములతో స్నానమాచరించి, శుచులై, చిత్రవిచిత్ర వర్ణములు గల వస్త్రములు ధరించిరి. క్రొత్తబియ్యముతోనూ, మర్రియిగుళ్ళతోనూ నింపబడిన పూర్ణకుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనమొనర్చి, చారుమతీ మొదలగు స్త్రీలందరు భక్తితో పూజలు సలిపిరి. “పద్మాసనే! పద్మకరే! సర్వలోకైకపూజితే! నారాయణప్రియే! దేవి! సుప్రీతా భవ సర్వదా || ” అను శ్లోకముచెప్పి వరలక్ష్మీదేవిని ఆహ్వానముచేసి, కల్పమందు చెప్పబడిన ప్రకారము షోడశోపచారపూజలనొనర్చి కుడిచేతికి తోరమును కట్టుకుని, నేతితో జేయబడిన భక్ష్యభోజ్యములను వరలక్ష్మీదేవికి నివేదనచేసి, సదాచారపరుడగు ఒక వృద్ధబ్రాహ్మణుని గంధాదులతో బూజించి, పండ్రెండు భక్ష్యములను దక్షిణ తాంబూలాదులతో వాయినమిచ్చి, ఆ దేవి సన్నిధానంబున తాము నివేదనచేసిన భక్ష్యభోజ్యములతో గూడిన యన్నమును భుజించిరి.

అనంతరము, వరలక్ష్మీ ప్రసాదమున చారుమతీ మొదలగు స్త్రీలందరు వరలక్ష్మీ అనుగ్రహమువలన ప్రాప్తించిన ముత్యములు మాణిక్యములతో గూడిన హారములను కంఠమున ధరించిరి. కాలియందెలను మణిమయములగు ఆభరణములను బడసిరి. ఇత్యాది సంపదలనే గాక, పుత్రపౌత్త్ర వృద్ధియు, ధనధాన్య సమృద్ధి కలవారైరి. ఎడతెగకుండ అన్నదానము చేయుచు, బంధుపోషణయందు శ్రద్ధగలవారలై, చతురంగబలోపేతములగు తమ తమ గృహములయందు సుఖముగా నుండిరి. ఆ నగరవాసులు, చారుమతి వలన వినిన ఈ వరలక్ష్మీ వ్రతమును గూర్చి ఒండొరులతో చెప్పుకొనిరి.

ఓ పార్వతీ ! “ఇది సత్యము, సత్యము, ఈ వ్రతమాచరించుట వలన మానవుడు అనేక శుభములను పొందును. చారుమతీ దేవి వలన మనము కోరిన కోరికెలనెల్ల బడసితిమి. ఆమెకు వరలక్ష్మీయే ప్రత్యక్షమై ఈ వ్రతముపదేశించినది. ఆమె ఎంత పుణ్యాత్మురాలు ఎంత మహిమగలది ! ” అని ఆ నగరములోని స్త్రీలు పతివ్రతయగు చారుమతిని గూర్చి కొనియాడిరి.

“కావున ఓ పార్వతీ! అది మొదలు ఈ వ్రతము వరలక్ష్మీ వ్రతమని లోకమున ప్రసిద్ధిగాంచెను. ఇది వ్రతములలోనెల్ల ఉత్తమమైనది. దీనిని సవిస్తరముగా చెప్పితిని. ఎవరీ వ్రతకథను శ్రద్ధాసక్తులు గలిగి విందురో, లేక సావధానచిత్తులగు ఇతరులకు వినిపింతురో, వారికి వరలక్ష్మీ ప్రభావమువలన సర్వకార్యములు సిద్ధించును ” అని శివుడు పార్వతీదేవితో చెప్పెను.

భవిష్యోత్తర పురాణమునందలి పార్వతీ పరమేశ్వర సంవాదమున శ్రీ వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణము.

(గౌరీ పూజాదికం పుస్తకం నుండి)

Sri VaraLakshmi Vratam

2 Comments

 1. గురువులకు నమస్సులు🙏.చాలా సులువుగా పూజ చేసుకునేవిధంగా రచించారు.మాకు చాలా ఉపయోగకరంగా ఉంది.ధన్య వాదములు🙏🙏🙏

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s