చేతః శ్రీ బాల కృష్ణం – రాగం జుజావంతి – తాళం రూపకం
పల్లవి
చేతః శ్రీ బాల కృష్ణం భజ రే
చింతితార్థ ప్రద చరణారవిందం ముకుందమ్
అనుపల్లవి
నూతన నీరద సదృశ శరీరం నంద కిశోరం
పీత వసన ధరం కంబు కంధరం గిరిధరమ్
మధ్యమ కాల సాహిత్యము
పూతనాది సంహారం పురుషోత్తమావతారం
శీతల హృదయ విహారం శ్రీ రుక్మిణీ దారమ్
చరణము
నవనీత గంధ వాహ వదనం మృదు గదనం
నళిన పత్ర నయనం వట పత్ర శయనం
నవ చంపక నాసికం అతసీ సుమ భాసకం
నతేంద్రాది లోక పాలకం మృగ మద తిలకమ్
మధ్యమ కాల సాహిత్యము
నవ తుళసీ వన మాలం నారదాది ముని జాలం
కువలయాది పరిపాలం గురు గుహ నుత గోపాలమ్
For related posts, click here -> కృష్ణుడు