త్యాగరాజ కృతి – గంధముపుయ్యరుగా

రాగం : పున్నాగవరాళి

తాళం :ఆది

పల్లవి: 

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

అను పల్లవి: 

అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ

చరణం (1):      

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగ

కలకలమను ముఖకళగని సొక్కుచు

 బలుకుల నమృతము లొలికెడు స్వామికి

చరణం(2):        

చేలము గట్టరుగా బంగరు చేలము గట్టరుగా

మాలిమితో గోపాల బాలులతో

నాల మేపిన విశాలనయనునికి

చరణం (3):  

హారతులెత్తరుగా ముత్యాల హారతు లెత్తరుగా

నారీమణులకు వారము యౌవన

వారక యొసగెడు వారిజాక్షునికి

చరణం (4):        

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా

జాజులు మరి విరజాజులు దవనము

రాజిత త్యాగరాజ నుతునికి

Gandhamupuyyaruga – Tyagaraja Kriti

For related posts, click here -> కృష్ణుడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s