పండు తాంబూలము నోము కథ
ఒక రాజుభార్య, మంత్రిభార్య పండుతాంబూలముల నోము పట్టిరి. మంత్రిభార్య ప్రతిదినమునూ తాంబొలములిచ్చి వ్రతమును సక్రమముగ జేసి సంతానమును బడసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరము పొడుగున ఇవ్వవలసిన తాంబూలములను ఒక్క నాడే ఇచ్చెను. అందుచేత ఆమెకు సంతానము లేకుండెను.
మంత్రి భార్యకు సంతానముండి తనకులేకుండుటకు చింతించి ఆ విషయము నామె పార్వతీదేవికి ప్రతిదినము పూజా సమయములందు విన్నవించుకొనుచుండెను. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెఅలయందు ప్రత్యక్షమై నీవు పండుతాంబూలము నోము నోచి తాంవూలము లన్నింటినీ ఒక్కనాడే ఇచ్చి ఉల్లంఘన చేయుటచే నీకు సంతానము లేదు కాన నీవా నోమును మరల నోచుకొనుము.’ అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఆమె బుద్ధి తెచ్చుకొని నోమును యధావిధిగ చేసి సంతానము ప్రాప్తినందెను.
దీనికి ఉద్యాపనము:- ఏడాది అయినతరువాత ఒక పుణ్యస్త్రీకి తలంటి నీళ్ళుపోసి భోజనముపెట్టి ఇరువది అయిదు పండ్లు, చీర, రవికెలగుడ్డ పెట్టి ఆమె కివ్వవలెను.
Pandu tambulamu nomu katha
For related posts, click on -> నోములు, వ్రతాలు – Nomulu & Vratalu