పసుపు తాంబూలము నోము కథ
ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెకును “అని చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతిదినము తాంబూలమందు ఐదు పసుపు కొమ్ములుంచి పేరంటాలునకియ్యవలెను.
దీనికి ఉద్యాపనము:- పసుపు, కుంకుమలు వీశేబులముచొప్పున పళ్ళెములోవేసి, చీర, రవికలగుడ్డ, తాంబూలము దక్షిణపెట్టి ముత్తయిదువునకు వాయన మియ్యవలెను.
Pasupu tambulamu nomu katha
For related posts, click on -> నోములు, వ్రతాలు