నిత్యవిభూతి నోము కథ
సోమయాజులుగారు తన ముద్దులకూతురునకు పెద్ద సంబంధము చూచి పెండ్లి చేసెను. ఆ అమ్మాయి అత్తవారింట సుఖముగా నుండెను. కాని ఆమెకు ఎన్ని వున్ననూ ఏదో లోపమున్నటులనే యుండెను. ఆ సంగతి అర్ధముకాక ఆమె అత్తగారు వియ్యంకునితో చెప్పెను. సోమయాజులుగారు తనకుమార్తె అసంతృప్తి పొందుచున్నదని గ్రహించి, ఆమెచే నిత్యవిభూతి నోము నోపించెను. వ్రతవిధానము ప్రకారము ఆమెతో రోజుకొక పుణ్యాంగనకు తలదువ్వించి బొట్టుపెట్టి తాంబూలమిప్పించెను. అట్లు ఏడాదిచేసిన పిమ్మట ఉద్యాపనము చేయించెను. అప్పటినుండి ఆమె సంతృప్తిజెంది సకలానందములతో జీవించుచుండెను.
దీనికి ఉద్యాపనము:- ఐదుతాంబూలములు, అయిదు రవికెల గుడ్డలు, అయిదు విభూతిపండ్లు పట్టుకొని శివాలయమునకువెళ్ళీ అయిదుగురు ముత్తైదువులకు గంధ కుంకుమాదులతో నలంకరించి పిమ్మట వాయన మియ్యవలెను. ముత్తయిదువులూ విభూతిపండ్లను శివుని సాన్నిధ్యమున వుంచిమిగిలినవి తీసుకొనవలెను. పద్ధతి తప్పుచేసిననూ ఫలితము తప్పదు.
Nitya vibhooti nomu katha
For related posts, click on -> నోములు, వ్రతాలు