బొమ్మలనోము సావిత్రీగౌరిదేవి కథ
ముక్కనుమనాడు పార్వతి శివునితో ‘స్వామీ! అష్టయిశ్వర్యములనిచ్చే అందాలనోమును చెప్పగోరెద’ననెను. అప్పుడు పరమశివుడు ‘నీవు పట్టిన బొమ్మలనోము గొప్పది’ యనెను. అప్పుడు అక్కడనున్న భక్తులామె నా నోముగూర్చి చెప్పమని కోరగా పార్వతి యిట్లు చెప్పదొడంగెను.
‘మూలగొడ్ల పేడచేసి మూలకదుళ్ళ నూలుపోసుకుని పదిమంది పేరంటాండ్రు వ్రతము చేయవలెను. బొమ్మల నిలిపిన మొదటి రోజు పులగమును, రెండవనాడు మధుపాన్నమును, మూడవనాడు బూరెలను, నాల్గవనాడు నానుబియ్యమును, అయిదవనాడు అరెసెలను, ఆరవనాడు గారెలను, ఏడవనాడు అట్లను, ఎనిమిదవనాడు మినపసున్ని, తొమ్మిదవనాడు పెరుగుతో పేరిన నెయ్యిని నైవేద్యముగ పెట్టి ఉద్యాపనము చేసుకొనవలెను. ఆ వ్రతము చేయుటవలననే నాకీ శివసాయుజ్యము వచ్చింది’ అని చెప్పెను.
దీనికి ఉద్యాపనము : ఒక్కొక్కచేటలోను తొమ్మిదేసి బిళ్ళకుడుములను, లక్కజోళ్ళను, నల్లపూసల కోవను, ఆకులను, పోకలను పెట్టి తొమ్మండుగురు ముత్తయిదువులకు వాయినమియ్యవలెను.
Bommalanomu savitri gowridevi katha
For related posts, click on -> https://shankaravani.org/category/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/