నవగ్రహ కృతి: సూర్యమూర్తే నమోస్తు తే
రాగం: సౌరాష్ట్రం
తాళం: ధ్రువ
పల్లవి:
సూర్యమూర్తే నమోస్తు తే సుందర ఛాయాధిపతే
అనుపల్లవి:
కార్య కారణాత్మక జగద్ప్రకాశ సింహరాశ్యధిపతే
(మధ్యమ కాల సాహిత్యం)
ఆర్య వినుత తేజస్స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద కీర్తే
చరణము:
సారస మిత్ర మిత్ర భానో సహస్ర కిరణ కర్ణ సూనో
క్రూర పాప హర కృశానో గురు గుహ మోదిత స్వభానో
సూరి జనేడిత సుదినమణే సోమాది గ్రహ శిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే దివ్యతర సప్తాశ్వ రథినే
మధ్యమ కాల సాహిత్యం
సౌరాష్టార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరి హరాత్మనే భుక్తి ముక్తి వితరణాత్మనే
Sri Muttuswami Dikshitar(Navagraha Kriti): SuryaMurte Namostute