॥ శివావతారులు శ్రీమదప్పయ్యదీక్షితుల ఆదిత్యస్తోత్రరత్నమ్ ॥
మనుష్యుడు ప్రతిదినమూ సూర్యునియొక్క ఈ స్తోత్ర రత్నాన్ని ఒక్కసారైనా పఠించి దుస్స్వప్న ఫలమును, అపశకునములను, సమస్తమైన పాపమునూ చికిత్సచేయరాని రోగములనూ, చెడ్డస్థానములనందున్న సూర్యాదిగ్రహముల గణముచేత కలిగింపబడిన దోషాలను దుష్టములైన భూతాలను గ్రహములు మొదలైన వాటిని పిశాచాదులను, దూరదూరంగా తొలగించివేస్తాడు. ఇహలోకంలో స్థిరమైన సంపదను పొందును, అంతమునందు ముక్తినికూడ పొందును. (ఫలశ్రుతి, చివరిశ్లోకం నుండి)
విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః
చక్రే పఞ్చారనాభిత్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః ।
సప్తచ్ఛన్దస్తురఙ్గాహితవహనధురో హాయనాంశత్రివర్గ
వ్యక్తాకౢప్తాఖిలాఙ్గః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః ॥ 1 ॥
ఆదిత్యైరప్సరోభిర్మునిభిరహివరైర్గ్రామణీయాతుధానైః
గన్ధర్వైర్వాలఖిల్యైః పరివృతదశమాంశస్య కృత్స్నం రథస్య ।
మధ్యం వ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః
బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘనీభావరూపః సమిన్ధే ॥ 2 ॥
నిర్గచ్ఛన్తోఽర్కబిమ్బాన్ నిఖిలజనిభృతాం హార్దనాడీప్రవిష్టాః
నాడ్యో వస్వాదిబృన్దారకగణమధునస్తస్య నానాదిగుత్థాః ।
వర్షన్తస్తోయముష్ణం తుహినమపి జలాన్యాపిబన్తః సమన్తాత్
పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాన్తి కాన్తిప్రరోహాః॥ 3 ॥
శ్రేష్ఠాస్తేషాం సహస్రే త్రిదివవసుధయోః పఞ్చదిగ్వ్యాప్తిభాజాం
శుభ్రాంశుం తారకౌఘం శశితనయముఖాన్ పఞ్చ చోద్భాసయన్తః ।
ఆరోగో భ్రాజముఖ్యాస్త్రిభువనదహనే సప్తసూర్యా భవన్తః
సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నాప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపన్తు ॥ 4 ॥
ఆదిత్యానాశ్రితాః షణ్ణవతిగుణసహస్రాన్వితా రశ్మయోఽన్యే
మాసే మాసే విభక్తాస్త్రిభువనభవనం పావయన్తః స్ఫురన్తి ।
యేషాం భువ్యప్రచారే జగదవనకృతాం సప్తరశ్మ్యుత్థితానాం
సంసర్పే చాధిమాసే వ్రతయజనముఖాః సత్క్రియాః న క్రియన్తే ॥ 5 ॥
ఆదిత్యం మణ్డలాన్తఃస్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్తవిశ్వం
ప్రాతర్మధ్యాహ్నసాయం సమయవిభజనాదృగ్యజుస్సామసేవ్యమ్ ।
ప్రాప్యం చ ప్రాపకం చ ప్రథితమతిపథిజ్ఞానినాముత్తరస్మిన్
సాక్షాద్ బ్రహ్మేత్యుపాస్యం సకలభయహరాభ్యుద్గమం సంశ్రయామి ॥ 6 ॥
యచ్ఛక్త్యాఽధిష్ఠితానాం తపనహిమజలోత్సర్జనాదిర్జగత్యామ్
ఆదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః ।
యత్ ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా
తం త్రైలోక్యస్య మూలం ప్రణమత పరమం దైవతం సప్తసప్తిమ్ ॥ 7 ॥
స్వఃస్త్రీగన్ధర్వయక్షా మునివరభుజగా యాతుధానాశ్చ నిత్యం
నృత్తైర్గీతైరభీశుగ్రహనుతివహనైరగ్రతః సేవయా చ ।
యస్య ప్రీతిం వితన్వన్త్యమితపరికరా ద్వాదశ ద్వాదశైతే
హృద్యాభిర్వాలఖిల్యాః సరణిభణితిభిస్తం భజే లోకబన్ధుమ్ ॥ 8 ॥
బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య
ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ ।
తత్ సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్యరూపం
భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణసూక్ష్మాంశమేకమ్ ॥ 9 ॥
ఆదిత్యే లోకచక్షుష్యవహితమనసాం యోగినాం దృశ్యమన్తః
స్వచ్ఛస్వర్ణాభమూర్తిం విదలితనలినోదారదృశ్యాక్షియుగ్మమ్ ।
ఋక్సామోద్గానగేష్ణం నిరతిశయలసల్లోకకామేశభావం
సర్వావద్యోదితత్వాదుదితసముదితం బ్రహ్మ శమ్భుం ప్రపద్యే ॥ 10 ॥
ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరేఽస్మిన్
యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్వర్కబిమ్బే స్థితస్య ।
యత్ పూజైకప్రధానాన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని
ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సోఽయమాద్యో భిషఙ్నః ॥ 11 ॥
ఆదిత్యే మణ్డలార్చిః పురుషవిభిదయాద్యన్తమధ్యాగమాత్మ-
న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా దీప్యమానమ్
గాయత్రీమన్త్రసేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపమ్ ।
నీలగ్రీవం త్రిణేత్రం శివమనిశముమావల్లభం సంశ్రయామి ॥12 ॥
అభ్రాకల్పః శతాఙ్గః స్థిరఫణితిమయం మణ్డలం రశ్మిభేదాః
సాహస్రాస్తేషు సప్త శ్రుతిభిరభిహితాః కిఞ్చిదూనాశ్చ లక్షాః ।
ఏకైకేషాం చతస్రస్తదను దినమణేరాదిదేవస్య తిస్రః
కౢప్తాః తత్తత్ప్రభావప్రకటనమహితాః స్రగ్ధరా ద్వాదశైతాః ॥ 13 ॥
దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిలమప్యామయానప్యసాధ్యాన్
దోషాన్ దుఃస్థానసంస్థగ్రహగణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ ।
నిర్ధూనోతి స్థిరాం చ శ్రియమిహ లభతే ముక్తిమభ్యేతి చాన్తే
సఙ్కీర్త్య స్తోత్రరత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నామ్ ॥ 14 ॥
ఈ దివ్య స్తోత్రం మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యముతో అచిరకాలంలో అందించబడుతుంది.
॥ ఇతి శ్రీమదప్పయ్యదీక్షితేన్ద్ర విరచితం ఆదిత్య స్తోత్ర రత్నమ్ ॥
For more related posts, click on Surya
1 Comment