పదహారు ఫలముల నోము కథ
రాజుభార్యయు, మన్త్రి భార్యయు, పదహారు ఫలముల నోము నోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రి భార్యకు మాణిక్యములవంటి బిడ్డలు పుట్టిరి. రాజుభార్యకు గ్రుడ్డివారు, కుంటివారు కలిగిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలచి తనకిట్టి బిడ్డలు పుట్టుటకు కారణమేమని యడిగెను. అందుకు మంత్రిభార్య ‘మహారాణీ! మీరు అన్నిరకముల పండ్లను ఒకేసారి తెప్పించి కోటలోవేసి ఒకేసారి పంచిపెట్టిరి. వాటిలో కొన్న వంకరపండ్లుండుటచే నట్టి సంతానము కలిగె’నని చెప్పి తిరిగి యామెచే నానోమునోపించెను. పిదపనామెకు కూడా సంతానము కలిగెను.
అది చేయు పద్ధతి : పదహారు రకముల పండ్లను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క జాతిఫలమును ఏరి ముత్తయిదువులకు పంచిపెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలయును.
Padaharu (16) phalamula nomu katha
For related posts, click on -> https://shankaravani.org/category/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/