గణేశుని నోము కథ
ఒక బ్రాహ్మణ స్త్రీ పూర్వజన్మమందు గణేశుని నోమునోచి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెకు గణేశుని నోము నోచి ఉల్లంఘంచినందుకు ఫలముగా గణేశుడు ఆమెకు దుఃఖమును ఇచ్చెను. ప్రతిదినము ఆమె హాయిగా కడుపార తిని , ఏమీతోచక ఒక మూల కూర్చండి ఏడ్చుచుండెడిది. అది చూచి ఊరివారందరునూ ఆమెను చీవాట్లు పెట్టదొడగిరి. దానితో ఆమె ఇంటిలో ఏడ్వడము మాని అడివికిపోయి యేడ్వదొడంగెను. ఆత్రోవనే పోవుచున్న పార్వతీపరమేశ్వరులామె ఏడుపునకు కారణము తెలుసుకొని ఒక పామును పట్టుకొని వెళ్ళి కొడుకుప్రక్కమీ వేయమనియు, నదికరచి అతడు చనిపోయినచో నేడ్వమనియు తెలిపిరి. ఆమె అట్లే చేసెను. కాని ఆ పామామె కొడుకువచ్చుసరికి బంగారుగోవ త్రాడయ్యెను అదిచూచి తానేడ్చుటకు కారణము దొరకలేదని మరల నడవిలోనేడ్చుచుండెను. మరల పార్వతీ పరమేశ్వర్లు వచ్చి ఒక తేలు నామెకిచ్చి దానిని కుమార్తె బొట్టుపెట్టెలో పెట్టమనియునది కుట్టినప్పుడామెతో నీవును ఏడ్వవచ్చుననియు తెలిపిరి. ఆమె అట్లేచేసెను. కాని ఆ తేలు బంగారు చేర్చుక్కగా నయ్యెను. నంతనామె మరల అడవికి పోయి శోకించుచుందగా పార్వతీపరమేశ్వరులు వచ్చి తన పెంపుడు పిల్లిని చంపి ఏడ్వమని చెప్పగా, ఆమె ఇంటికి వచ్చి తన పిల్లిని చంపి ఏడ్చు చుండెను. ఇరుగుఒరుగు వారందరు వచ్చుసరికి చచ్చినపిల్లి బంగారు పిల్లిగాఅయి పరుగెత్తుకొని పోయెను. ఈమె సిగ్గుపడి ఇంకా గట్టిగా ఏడ్చుచుండ అక్కడివారు నవ్వుకొని వెళ్ళిపోయిరి. అంతలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి అమ్మా! నువ్వు గణేశుని నోమునోచి ఉల్లంఘించిన కారణమున నీకు అకారణ శోకము వచ్చినది. అది పోవుటకు ఆ నోము నోచుకొమ్ము” అని చెప్పిరి. ఆమె ఆ నోము నోచి నిత్యసంతొషముతో సుఖముగా నుండెను.
దీనికి ఉద్యాపనము :- క్రొత్తమూకుడులో ఐదు గిద్దల నూనె పోసి, వత్తివేసి, శివాలయములో వెలిగించి దక్షిణతోను, స్వయంపాకముతోను ఆ జ్యోతిని అక్కడున్న నందిదగ్గర పెట్టవలెను.
Ganeshuni nomu katha
For related posts, click on -> https://shankaravani.org/category/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/