ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం
రాగం: శ్రీ
తాళం: ఖణ్డ ఏకం
పల్లవి
శ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితే
శ్రీపతివినుతే సితాసితే శివ సహితే
సమష్ఠిచరణం
రాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీ
రమావాణీసఖీ రాజయోగ సుఖీ
శాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరి
శఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరి
ఏకాక్షరి భువనేశ్వరి ఈశప్రియకరి
శ్రీకరి సుఖకరి శ్రీ మహాత్రిపుర సున్దరి
Sri Kamalambike shive pahi mam – Muttuswami