ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా
రాగం: ఆహిరి
తాళం: రూపకం
పల్లవి
శ్రీ కమలామ్బా జయతి అమ్బా
శ్రీ కమలామ్బా జయతి జగదామ్బా
శ్రీ కమలామ్బా జయతి
శృఙ్గార రస కదమ్బా మదమ్బా
శ్రీ కమలామ్బా జయతి
చిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బా
శ్రీ కమలామ్బా జయతి
శ్రీపుర బిన్దు మధ్యస్థ
చిన్తామణి మన్దిరస్థ
శివాకార మఞ్చస్థిత శివకామేశాఙ్కస్థా
అనుపల్లవి
సూకరాననాద్యర్చ్చిత మహాత్రిపురసున్దరీం రాజరాజేశ్వరీం
శ్రీకర సర్వానన్దమయ చక్రవాసినీం సువాసినీం చిన్తయేహమ్
దివాకర శీతకిరణ పావకాది వికాసకరయా
భీకర తాపత్రయాది భేదన ధురీణతరయా
పాకరిపు ప్రముఖాది ప్రార్థితసుకళేబరయా
ప్రాకట్య పరాపరయా పాలితోదయాకరయా
చరణం
శ్రీమాత్రే నమస్తే చిన్మాత్రే సేవిత రమా హరీశ విధాత్రే
వామాది శక్తిపూజిత పరదేవతాయాః సకలం జాతమ్
కామాది ద్వాదశభిరుపాసిత కాది హాది సాది మన్త్రరూపిణ్యాః
ప్రేమాస్పద శివ గురుగుహ జనన్యామ్ ప్రీతియుక్త మచ్చిత్తం విలయతు
బ్రహ్మమయ ప్రకాశినీ నామరూప విమర్శినీ
కామకలా ప్రదర్శినీ సామరస్య నిదర్శినీ
Sri Kamalamba jayati amba – Muttuswami