ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం
రాగం: శహన
తాళం: తిశ్ర త్రిపుట
పల్లవి
శ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమి
శ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం
అనుపల్లవి
రాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాం
పాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాం
హ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాం
హ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం
చరణం
శరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను భోగిన్యాం
విరిఞ్చి హరీశాన హరిహయ వేదిత రహస్యయోగిన్యాం
పరాది వాగ్దేవతారూపవశిన్యాది విభాగిన్యాం
చరాత్మక సర్వరోగహర నిరామయ రాజయోగిన్యాం
మధ్యమ కాల సాహిత్యం
కరధృత వీణా వాదిన్యాం కమలానగర వినోదిన్యాం
సురనరమునిజనమోదిన్యాం గురుగుహవరప్రసాదిన్యాం
Sri Kamalambikayam bhaktim – Muttuswami