రాగం: పూర్ణచంద్రిక
తాళం: ఆది
పల్లవి
శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి శివే పాహిమామ్ వరదే
అనుపల్లవి
నీరజాసనాది పూజితాపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే
చరణము
శౌరి విరిన్చాది వినుత సకళే శఙ్కర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖప్రదే నిష్కళే పూర్ణచన్ద్రికా సీతళే విమలే
మధ్యమ కాల సాహిత్యం
పరమాద్వైత బోధితే లలితే ప్రపఞ్చాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే
Muttuswami Deekshit : Sri Rajarajeswari Tripurasundari