రాగం: దేవగాన్ధారమ్
తాళం: ఆది
పల్లవి
పఞ్చాశత్పీఠరూపిణి మామ్ పాహి శ్రీరాజరాజేశ్వరి
అనుపల్లవి
పఞ్చదశాక్షరి పాణ్డ్యకుమారి పద్మనాభ సహోదరి శఙ్కరి
మధ్యమ కాల సాహిత్యం
మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని
చరణం
దేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి
దేశకాల ప్రవర్తిని మహా దేవ మనోల్లాసిని నిరఞ్జని
మధ్యమ కాల సాహిత్యం
దేవరాజముని శాపవిమోచని దేవగాన్ధారరాగతోషిణి
భావ రాగ తాళ విశ్వాసిని భక్తజనప్రియ ఫల ప్రదాయిని
Muttuswami Deekshit : Panchashatpeetharoopini