అర్గలా స్తోత్రమ్
ఓం అస్య శ్రీమదర్గలాస్తోత్ర మంత్రస్య విష్ణుఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీః దేవతా శ్రీ జగదంబా ప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపె వినియోగః||
ఓమ్ నమశ్చండికాయై||
మార్కండేయ ఉవాచ
ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ|
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే||1||
జయశీలవగు జయన్తీదేవి! ప్రళయకర్త్రివియగు కల్యాణకారిణివి అగు భద్రకాళీ దేవి! కపాలధారిణివైన కపాలినీ మాతా! దుస్సాధ్యమైనట్టి దుర్గామాతా! కాళీమాతా! కరుణాహృదయవగు క్షమాదేవి! మంగళకారిణివైనట్టి శివాదేవి! జగత్తును ధరించునట్టి ధాత్రీదేవి! యజ్ఞ్భాగములను స్వీకరించి దేవతలను పోషించునట్టి స్వాహా దేవి! శ్రాద్ధతర్పణాదులయందు అన్నపానాదులను అందుకొని పితృదేవతలను పోషించునట్టి స్వధాదేవి! ఓ అమ్మా నీకు నమస్కారము.
జయ త్వం దేవి చాముండే జయభూతార్తిహారిణి|
జయ సర్వగతే దేవి కాళారాత్రి నమోఽస్తుతే||2||
చాముండేశ్వరీదేవి! నీకు జయము. జయము. సర్వప్రాణుల దుఃఖమును హరించు తల్లి! నీకు జయమగుగాక. అంతటను అంతర్యామిరూపమున అవస్థితమైయున్న మాతా! నీకు జయము. బ్రహ్మాదులతోకూడ సృష్టినంతటిని లయింపజేయునట్టి ఓ అమ్మా! నీకు నమస్కారము.
మధుకైటభవిద్రావి విధాతృవరదే నమః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||3||
మధుకైటభులను రాక్షసులను సంహరించి బ్రహ్మదేవునకు వరములిచ్చిన మాతా! నీకు నమస్కారము. ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
మహిషాసురనిర్ణాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||4||
మహిషాసురుని సంహరించిన దేవి! భక్తులకు సౌఖ్యములిచ్చు జననీ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
రక్తబీజవధే దేవి చండముండవినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||5||
ఓ జననీ! రక్తబీజుడు చండముండులువంటి రాక్షసవీరులను సంహరించిన మాతా! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
శంభుస్త్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||6||
శంభుడు నిశుంభుడు ధూమ్రాక్షుడు మున్నగు రాక్షసులను సంహరించిన జననీ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||7||
భక్తజనులచే నిరంతరము నమస్కరింపబడు పాదపద్మములుగల తల్లీ! సకలవిధములైన ఐశ్వర్యాది సౌభాగ్యములను అనుగ్రహించు ఓ దయామయీ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
అచింత్యరూపచరితె సర్వశత్రువినాశినీ|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||8||
మననము చేయుటకు సాధ్యముకాని స్వరూపముకల దేవేశి! ఆలోచించుటకు శక్యముకాని చరిత్రలుకల ఓ భవానీ! శత్రువులనందరిని సంహరింపగల చండికామాతా ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||9||
ఓ చండికా పరమేశ్వరి! భక్తితో నమస్కరించువారల పాపములను హరించు జననీ ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
స్తువద్భ్యోః సర్వదా భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||10||
చండీశ్వరీ! భక్తిపూర్వకముగ స్తోత్రము చేయువారల ఆధివ్యాధులను, త్రివిధతాపములను నశింపజేయు దయామయి! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
చండికే సతతం యే త్వామర్చయంతీహభక్తితః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||11||
పరమేశ్వరి! ఎల్లప్పుడూ నిన్ను భక్తితో పూజించువారలకు కూడ సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. వారి శత్రువులందరిని నశింపజేయుము.
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమసుఖమ్|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||12||
పరమేశ్వరి! నాకు ఐశ్వర్యమును, ఆరోగ్యమును, చక్కని సుఖమును, సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||13||
పరమేశ్వరి! నా శత్రువులకు వినాశమును కలిగింపుము. నాకు విశేషమైన బలమును ఇమ్ము. అట్లే నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
విధేహి దేవి కల్యాణం విధేహి పరమాంశ్రియమ్|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||14||
ఓ పరమేశ్వరి! నాకు శుభమును ఇమ్ము. సుఖమును ఇచ్చు సంపదను ఇమ్ము. ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
సురాసురశిరోరత్ననిఘృష్థచరణే అంబికా|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||15||
అటు దేవతలు, ఇటు రాక్షసులు ధరించెడు కిరీటములయందలి రత్నములకాంతులతో రాపిడి పొందుచున్న పాదములుగలతల్లీ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనంకురు|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||16||
పరమేశ్వరి! నీ భక్తుడైన ప్రతివానిని విద్యావంతునిగను, కీర్తివంతునిగను, శ్రీమంతునిగను చేయుము. ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
ప్రచండదైత్యఘ్నే చండికే ప్రణతాయ మే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||17||
భయంకరులైన రాక్షసుల గర్వమును అణగద్రొక్కిన చండికామాతా! నీకు నమస్కారము. ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
చతుర్భుజే చతుర్వ్క్త్రసంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||18||
నాలుగు భుజములతో శోభించెడు ఓ తల్లీ! నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవునిచే స్తుతింపబడు పరమేశ్వరీ! ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||19||
ఓ జననీ! ఎల్లవేళలయందు నిరంతరముగ విష్ణుభగవానునిచే స్తోత్రము చేయబడుచుందువు. కావున ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||20||
హిమవంతుని పుత్రికవగు పార్వతీదేవి! నీవు నీ పతియగు శివునిచేత చక్కగా స్తోత్రము చేయబడుచుందువు. అట్టి ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
ఇంద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||21||
శచీదేవిభర్తయగు ఇంద్రునిచేత బ్రహ్మభావనతో పూజింపబడు ఓ అమ్మా! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
దేవి ప్రచండదోర్దండ దైత్యదర్ప వినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||22||
ఓ అమ్మా! భయంకరమైన బాహువులు కలిగిన రాక్షసుల మదము అణిచిన ఓ తల్లీ! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
దేవి భక్తజనోద్దామదత్తానందోదయే అంబికా|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||23||
ఓ అమ్మా! నీ భక్తజనులకు అంతులేని మహదానందమును ప్రసాదించెదవు. కావున ఓ తల్లీ! నాకు సుందరమగు రూపమును, విజయమును, కీర్తిని ప్రసాదింపుము. నా శత్రువులందరిని నశింపజేయుము.
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్|
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్||24||
సుందరమైనదియు, మనస్సును ఎరిగి ప్రవర్తించునదియు, దుర్గమమైన సంసారసాగరమునుండి దాటించునదియు, శిష్టులైన వారియింట పుట్టినది అయిన ధర్మపత్నిని అనుగ్రహింపుము.
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రంపఠేన్నరః|
స తు సప్తశతీ సంఖ్యావర మాప్నోతి సంపదామ్||25||
ఈ అర్గలాస్తోత్రమును పఠించిన పిదపనే సాధకుడైన మనుష్యుడు, సప్తశతిఅనబడు మహాస్తోత్రమును పఠింపవలయును. అతడు మాత్రమే సప్తశతీ స్తోత్రమునగల ఏడువందల మంత్రముల సంఖ్యకు సరిపడు ష్రేష్ఠమైన ఫలమును వివిధ సంపత్సమూహములను (శమాది షట్కసంపత్తియును) పొందును.
||ఇతి మార్కండేయపురాణే దేవ్యాః అర్గలాస్తోత్రం సంపూర్ణం||
Argala stotram