స్వాతీ తిరుణాళ్ కృతి : జనని పాహి
రాగం: శుద్ధసావేరి
తాళం: చాపు
పల్లవి:
జనని పాహి సదా జగదీశే దేవి
సురహరవల్లభే
అనుపల్లవి:
అనవద్యతర నవహారాలంకృతే మఞ్జు-
వనజాయత లోచనే వాహినీతటవాసే
చరణము:
శైలరాజతనయే చణ్డముణ్డనాశిని
శూలశోభితకరే సున్దరరూపే
ఫాలరాజితిలకే పరమకృపావతి
పాలితసుజనమాలికే సుర-
సాలకిసలయ చారునిజపాదే ॥1॥
మహితబాహుబల మహిషాసురాది-
గహన దహనాయితే గతమదసేవ్యే
సుహసితజితకున్దే శోణజపాధరి
విహర మమ హృది విధుసదృశముఖి
బహళమలయజబన్ధురే లోక- ॥2।
పరమపావన శ్రీ పద్మనాభసహోదరి
నీలచికురే కేసరివరవాహే
చరితదురితభక్తదరనికరే గౌరి
కురు కృపాం మయి కలిశధరముఖపరిణుతే
ఘనదురితహృతిలోలే ॥3॥
Swati Tirunal Kriti: Janani Pahi ( Navarathri krithi- 7)