ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయాస్తవ
రాగం: పున్నాగ వరాళి
తాళం: రూపకమ్
పల్లవి
కమలాంబికాయాస్తవ భక్తోऽహం
శంకర్యాః శ్రీ-కర్యాః సంగీత రసికాయాః శ్రీ
అనుపల్లవి
సుమ శరేక్షు కోదండ పాశాంకుశ పాణ్యాః
అతి మధుర-తర వాణ్యాః శర్వాణ్యాః కల్యాణ్యాః
మధ్యమ కాల సాహిత్యం
రమణీయ పున్నాగ వరాళి విజిత వేణ్యాః శ్రీ
చరణం
దశ కలాత్మక వహ్ని స్వరూప –
ప్రకాశాంతర్దశార సర్వ రక్షా-కర చక్రేశ్వర్యాః
త్రి-దశాది నుత క-చ-వర్గ-ద్వయ-మయ సర్వజ్ఞాది –
దశ శక్తి సమేత మాలినీ చక్రేశ్వర్యాః
త్రి-దశ వింశద్వర్ణ గర్భిణీ కుండలిన్యాః
దశ ముద్రా సమారాధిత కౌళిన్యాః
మధ్యమ కాల సాహిత్యం
దశ రథాది నుత గురు గుహ జనక శివ బోధిన్యాః
దశ కరణ వృత్తి మరీచి నిగర్భ యోగిన్యాః శ్రీ
Kamalaambikaayaastava – Muttuswami