రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది
పల్లవి
శారదే పాహిమాం సరోరుహనిభపదే
సారసాక్ష శ్రీవాసుదేవ కరుణాన్వితే వరదే॥
అనుపల్లవి
నీరజాసనజాయే నిఖిలవిద్యాప్రదే
నారదాదిసకలమునివినుతే సురదే॥
చరణం
చారువీణాది సుశోభితకరే
హీరమణిహారలసితకంధరే॥
వారణేంద్రగమనే నతసురనికరే
వారిజేక్షణే రుచిరబింబాధరే॥
Mysore Vasudevacharya :Sharade pahi mam