రాగం: కీరవాణి
తాళం: ఆది
పల్లవి
అంబా వాణి నన్నాదరించవే ||
అనుపల్లవి
శంబరారి వైరి సహోదరి కంబు గళేసిత కమలేశ్వరి ||
చరణం
పరదేవి నిన్ను భజియించే భక్తులను బ్రోచే పంకజాసని
వర వీణాపాణి వాగ్విలాసిని హరికేషపుర అలంకారి రాణి ||
Muthiah Bhagavatar: Ambavani nannu