రాగం: సరస్వతి మనోహరి
తాళం: ఆది
పల్లవి
సరస్వతి మనోహరి శంకరి
సదానంద లహరి గౌరి శంకరి
అనుపల్లవి
సరసీరుహాక్షి సదాశివ సాక్షి
కరుణా కటాక్షి పాహి కామాక్షి
మధ్యమ కాల సాహిత్యం
ముర హర సోదరి ముఖ్య కౌమారి
మూక వాక్ప్రదాన-కరి మోద-కరి
చరణం
అకారాద్యక్షర స్వరూపిణి
అంతఃకరణ రూపేక్షు చాపిని
ప్రకాశ పరమాద్వైత రూపిణి
పరే త్రిపుర సుందరి తాపిని
మధ్యమ కాల సాహిత్యం
ప్రకల్పిత ప్రపంచ ప్రకాశిని
ప్రసిద్ధ గురు గుహ జనని పాశిని
వికల్ప జటిల విశ్వ విశ్వాసిని
విజయ కాంచీ నగర నివాసిని
Muttuswamy Dikshitulu :Saraswati manohari