రాగం: దేవగాన్ధారి
తాళం: ఆది
పల్లవి
శారదే వీణావాదనవిశారదే వన్దే తవ పదే
అనుపల్లవి
నారదజనని చతుర్వదననాయకి భుక్తిముక్తిదాయకి
నళినదళలోచని భవమోచని హంసవాహిని హంసగామిని
చరణం
ఇన్ద్రాది సకల బృన్దారక గణ వన్దిత పదారవిన్దే
ఇన్దువిడంబన మన్ద స్మితయుత సున్దర ముఖారవిన్దే
వన్దారు సుజన మందార దయా సదనే మృదుగతనే
వాణి నిత్యకల్యాణి వరదే రామదాసహృదయాలయే శ్రీ
Papanasam Sivan kriti: Sharade Veenavadana