స్వాతీ తిరుణాళ్ కృతి : భారతి మామవ
రాగం: తోడి
తాళం: ఆది
పల్లవి:
భారతి మామవ కృపయా నతజనార్తి-
భార హరణనిరతయా
అనుపల్లవి:
శారద విధుమణ్డల సదృశ మనోహరముఖి
చరణము:
వాసవాది సురవినుతే తరణిసత-
భాసుర భూషణలసితే
హాసజిత కున్దవితతే విమలముక్తా-
హారకణ్ఠి గజేన్ద్రగతే
దాసభూతజన విద్యాదానలోలే పరదేవి
భాసుర చన్దనమృగ మద కుసుమ సు-
వాసితగాత్రి సుపావనశీలే ॥1॥
నారదాది మనోనిలయే భువనత్రయ-
నాయికే కృతాజ్ఞానిలయే
చారుబాహు ధృతవలయే వికచ-
సారసాక్షి తోషితభూవలయే
మారకార్ముఖ సుషమాచోరచిల్లియుగే వాణీ
వారిజభవదయితే వరవీణా-
వాదనలోల కరాఙ్గుళిజాలే ॥2॥
సకలాగమమయరూపే నిఖిలలోక-
జనని సుధామధురాలాపే
అకలఙ్క గుణకలాపే కరుణారస-
హతవివశ జనవిలాపే
సకలే పద్మనాభ సరసిజ సేవకవర-
శుకసనకాది మునీశ్వరవినుతే
సోమకలా సదృశామలఫాలే ॥3॥
Swati Tirunal Kriti: Bharati mamava( Navarathri krithi- 4)