స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి పావనే
రాగం: సావేరి
తాళం: ఆది
పల్లవి:
దేవి పావనే సేవే చరణే తే బుధావనే
అనుపల్లవి:
భావుకదాయి కటాక్షవిలాసిని
భారతి దేహి సదా కుశలం భువనేశ్వరి
చరణము:
సోమబింబ మదహర సుముఖి భక్తజనాఖిల-
కామిత దాననిరతే కాన్త కున్దదన్తి
భీమాఽనన్తాజ్ఞాన తిమిరభేదన మిహిరాయితే
మామక హృది విహర మాన్యగుణావాసే
సామజ పుఙ్గవ చారుగతే సుర-
సాధ్యనుతే విమలే వరదే భువనేశ్వరి ॥1॥
వారిదనిభచికురే వాసవోపలనయనే
మారశరాసన రుచిచోరచిల్లికాన్తే
సారసకృతనిలయే జాంబునద మయభూషే
నారదాదిముని నుతనామ సముదాయే
భూరి మనోజ్ఞ కరాఞ్చితవీణా-
పుస్తకభాసిని చారుహాసే భువనేశ్వరి ॥2॥
పాతిత దితిసుతే శ్రీపద్మభవవిలాసిని
వీతపాప జనగేయవిభవే విద్యారూపే
చాతకో జలదమివ సాదరమాశ్రయామి త్వాం
ప్రీతిం మయి కురు లోకమాతరయి నిత్యం
ధూతమలం కురు మాం సదయే పరి-
పోషితసూరిగుణే శుభదే భువనేశ్వరి ॥|3॥
Swati Tirunal Kriti: Devi Pavane( Navarathri krithi- 3)