ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబా సంరక్షతు
రాగం: ఆనంద భైరవి
తాళం: చాపు
పల్లవి
కమలాంబా సంరక్షతు మాం
హృత్కమలా నగర నివాసినీ అంబ
అనుపల్లవి
సుమనసారాధితాబ్జ ముఖీ
సుందర మనఃప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ
కాంతా తార పంజర శుకీ
చరణము
త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిద్ధీశ్వరీ
నిత్య కామేశ్వరీ
క్షితి పుర త్రై-లోక్య మోహన చక్రవర్తినీ
ప్రకట యోగినీ
సుర రిపు మహిషాసురాది మర్దినీ
నిగమ పురాణాది సంవేదినీ
మధ్యమ కాల సాహిత్యము
త్రిపురేశీ గురు గుహ జననీ
త్రిపుర భంజన రంజనీ
మధు రిపు సహోదరీ తలోదరీ
త్రిపుర సుందరీ మహేశ్వరీ
Kamalamba samrakshatu – Muttuswami