ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికే ఆశ్రిత
రాగం: తోడి
తాళం: రూపకమ్
పల్లవి
కమలాంబికే ఆశ్రిత కల్ప లతికే చండికే
కమనీయారుణాంశుకే కర విధృత శుకే మామవ
అనుపల్లవి
కమలాసనాది పూజిత కమల పదే బహు వరదే
కమలాలయ తీర్థ వైభవే శివే కరుణార్ణవే
చరణము
సకల లోక నాయికే సంగీత రసికే
సు-కవిత్వ ప్రదాయికే సుందరి గత మాయికే
వికళేబర ముక్తి దాన నిపుణే అఘ హరణే
వియదాది భూత కిరణే వినోద చరణే అరుణే
మధ్యమ కాల సాహిత్యము
సకళే గురు గుహ కరణే సదాశివాంతఃకరణే
అ-క-చ-ట-త-పాది వర్ణే అఖండైక రస పూర్ణే
Kamalambike- Muttuswami