ఓగిరాల వీరరాఘవ శర్మ కృతి: దేవీ గాయత్రీ నీసాటి
రాగం: హుసేని
తాళం: ఆది
పల్లవి
దేవీ గాయత్రీ నీసాటి
దైవమెవరిల జగదేక సంవర్ధని పర
అనుపల్లవి
నీవే బ్రహ్మము నీవే త్రిగుణము
నీవే సకలము నిగమపంజరశుకి
చరణము
రవిమండల వాసిని సుహాసిని
భవతరణి మందేహాసురభంజని
నవశశికళాధర పంచవర్ణానన
భువి రాఘవకృత గీతగాన సమ్మోదిని
Ogirala Veeraraghava Sharma:Devi Gayatri Nee Sati