ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయై నమస్తే
రాగం: నాట కురంజి
తాళం: రూపకమ్
పల్లవి
బాలాంబికాయై నమస్తే వర దాయై శ్రీ
అనుపల్లవి
బాలాది నామ రూపాయై
భక్త చిత్త కేకి ఘనా ఘనాయై
మధ్యమ కాల సాహిత్యము
బాల చంద్ర సేవితాయై భారతీశ పూజితాయై
చరణము
హాటకాభరణాయై హంస నాద ముదితాయై
హరిద్రాన్న రసికాయై గురు గుహ స్వరూపాయై
మధ్యమ కాల సాహిత్యము
నాట కురంజీ రాగ ప్రియానంద-కర్యై
నటేశ్వర్యై వైద్య పతి మనోల్లాస-కర్యై
Balambikayai namaste- Muttuswami