వేమన శతకం
ఆ.మేక కుతికపట్టీ | మెడచున్న గుడువుగా
ఆక లేల మాను | నాశగాక
లోభివాని నడుగ | లాభంబు లేదయా
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము:ఓ వేమా! మేక యొక్క మెడను పట్టుకొని మెడక్రింద నుండు చన్నులను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు. పాలు లభించవు. అట్లే లోభి వానిని అడిగి ప్రయోజనము ఉండదు.
Vemana Shatakam -39