సుమతీ శతకము.
క.కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుగ| నేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు| నిక్కము సుమతీ!
తాత్పర్యము : సుమతీ! ఒకరికి ఒకరు స్నేహముతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కన్పడవు. కాని ఆ స్నేహము చెడిన వెంటనే ఒప్పలే తప్పులుగా కనబడుచుండును. ఇది జగము నందు సత్యము. మానవ సహజ గుణము.
Sumati Shatakamu – 38