వేమన శతకం
ఆ.కనియు గానలేడు | కదలింపడా నోరు
వినియు వినగలేడు| విస్మయమున
సంపదగలవాని | సన్నిపాతంబిది
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! కంటితో చూచుచుండియు యథార్థమును తెలుసుకొనలేడు. మాట్లాడుటకు నోరు కదలించు ప్రయత్నము కూడా చేయడు. వినుచుండియు, ఆశ్చర్యము కలుగునట్లుగ విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నించడు. సన్నిపాత రోగి గుణ్ములవలె ధనవంతుల దుష్టలక్షణములు ఈ విధముగానే ఉండును.
Vemana Shatakam -37