సుమతీ శతకము.
క.కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు | ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ | నొల్లదు సుమతీ|
తాత్పర్యము : చీటిమాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటినీరు క్రింద పడినచో ఆ ఇంటి నుంచి సంపద తొలగిపోవును. అనగా సంపద సౌఖ్యములు తొలగి దారిద్ర్యము రాగలదని భావము.
Sumati Shatakamu – 37