వేమన శతకం
ఆ. కులము గలుగువారు| గోత్రంబు గలవారు
విద్య చేత విఱ్ఱ| వీగు వారు
పసిడిగల్గువాని| బానిస కొడుకులు
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! మంచి కులము నందు పుట్టిన వారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించు వారునూ, ఈ అందరునూ సంపద గల వానిని చూచి ఆశ్రయిస్తారు. వానికి లోబడి బానిసగా ఉంటారని భావము.
Vemana Shatakam -36