సుమతీ శతకము.
క.కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణములేని బూరెయు
వీరణములేని పెండ్లి వృథరా సుమతీ!
తాత్పర్యము : సుమతీ! కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీయును, పూర్ణములేని బూరెయును, మంగళవాద్యములు లేని పెండ్లియును, ఇవి అన్నీ నిరుపయోగమైనవి.
Sumati Shatakamu – 36