వేమన శతకం
ఆ. కులములేనివాడు | కలిమిచే వెలయును
కలిమి లేనివాడు | కులము దిగును
కులముకన్నభువిని | కలిమి ఎక్కువసుమీ
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! కులము తక్కువవాడు అయినను సంపద ఉన్న యెడల గొప్పవాడుగా కీర్తి పొందును. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినను తక్కువ కులము వాడుగనే పరిగణింపబడును.అందుచే కులము కంటే సంపదే ముఖ్యము.
Vemana Shatakam -35