సుమతీ శతకము.
క. కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత | పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు | లేశము సుమతీ!
తాత్పర్యము : సుమతీ!దుర్జనుడితో స్నేహము చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్ది మాత్ర్ము కూడా ప్రేమ ఉండదు.
Sumati Shatakamu – 34