వేమన శతకం
ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి దూరముపారు
బైట మూరెడైన| బాఱలేదు
స్థాన బల్మి గాని| తన బల్మి కాదయా
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు మొసలి ఎంత దూరమైననూ పోగలదు.భూమి మీద ఒక్క మూరెడు దూరమైననూ పోలేదు. అది ఆ మొసలి నివసించుచూ ఉన్న ప్రదేశము యొక్క బలమేగాని మొసలికి గల స్వశక్తి కాదు.
Vemana Shatakam -33