సుమతీ శతకము.
క. కవిగాని వాని వ్రాతయు
నవరస భావములు లేని | నాతుల వలపుం
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు | వృథరా సుమతీ!
తాత్పర్యము : సుమతీ! నవరస భావములు లేకుండా, కవిత్వము నేర్వని వాడు వ్రాసిన వ్రాతయు, స్త్రీలయొక్క ప్రేమ, తనకు ముందుగా పరిగెత్తుచున్న పందిని కొట్టలేని మానవుని నానావిథ ఆయుధములను వాడుట యందలి నేర్పరితనము వ్యర్థము.
Sumati Shatakamu – 33