సుమతీ శతకము.
క. కసుగాయ గఱచి చూచిన
మసలక తన యొగరు గాక | మధురంబగునా?
పసగలుగు యువతు లుండగ
బసిబాలల బొందువాడు | పశువుర సుమతీ!
తాత్పర్యము : సుమతీ! పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటెనే ఒగురు పుట్టును. కాని మధురముగా ఉండదు. అట్లే యవ్వనవతులైన స్త్రీలుండగా పసి బాలలతో సంభోగించుట వికటమనిపించును. అందుచే కామ వాంఛ తీరదు. అట్టివాడు పశువుతో సమానము.
Sumati Shatakamu – 32