వేమన శతకం
ఆ. కోపమునను ఘనత| కొంచెమైపోవును
గోపమునను మిగుల| గోడు గలుగు
గోప మడచెనేని| గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ | వినురవేమ!
తాత్పర్యము: ఓ వేమా! మనుష్యుని యొక్క గొప్పతనము కోపముచేత తగ్గిపోవును. దానిచే బాధలు కల్గును. కోపమును తొలగించుకొన్నచో అన్ని కోర్కెలు తీరును. కాబట్టి మనుష్యుడు కోపమును తగ్గించుకొనవలెను.
Vemana Shatakam -31