సుమతీ శతకము.
క. కరణముల ననుసరింపక
విరసంబున దిన్నతిండి| వికటించు జుమీ
యిరుసున గందెన బెట్టక
పరమేశ్వరుడు బండియైన| బాఱదు సుమతీ!
తాత్పర్యము : సుమతీ! బండి ఇరుసునకు కందెన (ఆముదము వగైరా) పెట్టకున్నచో పరమేశ్వరుని బండి అయినను పరిగెత్తదు. అట్లే కరణముతో పనియున్నచో ఆ కరణమును అనుసరించి అతడికి హితముగా ఉండవలెను. అతడితో విరోధము పెట్టుకొనిన యెడల తిన్న తిండి కూడా శరీరమునకు సరిపడక వికటించును.
Sumati Shatakamu – 30