సుమతీ శతకము.
క. కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని | మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక | మనవలె సుమతీ!
తాత్పర్యము : సుమతీ! ఒక కరణము, మఱియొక కరణమును నమ్మిన యెడల ప్రాణాపాయమైన ఆపదలు కల్గును. బ్రతుకుట కష్టతరము అగును. అందుచే కరణము తన సాటి కరణాన్ని నమ్మకుండా అతడికి మర్మమును చెప్పక, ఉండుట మంచిదని భావము. కరణము అంటే గ్రామ లెక్కలు వ్రాయువాడని అర్థము.
Sumati Shatakamu – 29